Gorantla Butchayya : చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

Gorantla Butchayya : చంద్రబాబుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమావేశం

Gorantla

Updated On : September 2, 2021 / 5:13 PM IST

Gorantla meeting with Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. గురువారం (సెప్టెంబర్ 2, 2021) మంగళగరిగిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశం అయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పార్టీలో పరిస్థితులపై ఇటీవల గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేతల సంప్రదింపులతో ఆయన ఇవాళ అధిష్ఠానం వద్దకు వెళ్లారు. చంద్రబాబుతో గోరంట్ల సమావేశమైన సమయంలో ఆయన వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్‌, జవహర్‌ ఉన్నారు.

టీడీపీలో పరిస్థితులపై ఇటీవలే గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామాకు సైతం ఆయన సిద్ధపడ్డారు. కొంత మంది నేతల తీరుతో పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని సన్నిహితుల దగ్గర మొరపెట్టుకున్నారు. అధిష్టానంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు అధిష్టానం త్రిసభ్య కమిటీని నియమించింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్‌.జవహర్‌లు ఇటీవల బుచ్చయ్యచౌదరి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు.

బుచ్చయ్యచౌదరి అభిప్రాయాలు, మనోభావాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన విషయాలను పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అధినేతను కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గోరంట్ల కాస్తా మెత్తపడ్డారు. దీంతో ఇవాళ చంద్రబాబు సమయం ఇవ్వడంతో ఆయనతో సమావేశం అయ్యారు. తన అభిప్రాయాలను చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లారు.