శ్రీశైలం వివాదంపై చర్యలు.. గోశాల ఇంఛార్జీ, తొమ్మిది మంది సిబ్బంది బదిలీ

Goshala in charge and nine staff transferred Srisailam devastanam : శ్రీశైలం వివాదంపై ఆలయ ఈవో రామారావు చర్యలు చేపట్టారు. గోశాల పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రజాక్ అనే వ్యక్తి భార్య సాయికుమారిపై బదిలీవేటు పడింది. సాయికుమారిని మరో విభాగానికి బదిలీ చేశారు. రజాక్ భార్య సాయికుమారి గోశాల ఇంఛార్జీగా ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే శ్రైశలం దేవస్థానం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగానికి చెందిన సిబ్బందిని బదిలీ చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థుల వివాదం, గోశాలలో గోవులు చనిపోతున్నాయని ఆరోపణలు తలెత్తున్న నేపథ్యంలో ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సాయికుమారి స్థానిక వైసీపీ నాయకుడు రజాక్ సతీమణి.
మల్లన్న పుణ్యక్షేత్రంలో మాంసం అమ్ముతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పువ్వుల కింద మాంసం సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం నడిపే గోశాలలోని గోవులు ఎలా చనిపోతున్నాయని ప్రశ్నించారు. గోవులను చంపేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రజాక్ అనే వ్యక్తి ఎవరు? ఆయనకు శ్రీశైలం దేవస్థానంలో ఏం పని అని ప్రశ్నించారు. రజాక్ భార్యను గోశాలకు ఇంచార్జ్‌గా ఎలా నియమించారని విమర్శించారు. శ్రీశైలం దేవస్థానం నడిపే గోశాలలోని గోవులు చనిపోతున్నాయని, దీని వెనుక ఎవరున్నారో ఎమ్మెల్యేకు తెలియదా..అని ఆయన ప్రశ్నించారు. శ్రీశైళంలో అన్యమతస్థల వివాదం, గోశాలలో గోవులు చనిపోతున్నాయనే ప్రచారంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఏపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం ముదురింది. పుణ్యక్షేత్రంలో దుకాణాల కేటాయింపు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. శ్రీశైలంలో అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆరోపణల్ని నిరూపించకుంటే రాజాసింగ్ రాజీనామా చేస్తాడా అంటూ శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలం క్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని… దీని వెనక కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు
రజాక్‌ను రంగంలోకి దింపి అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో పైకిరావాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. గ్రేటర్‌లో బీజేపీ మతాల్ని రెచ్చగొట్టి గెలిచినట్లు.. ఏపీలో కూడా చేయాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తొలగించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి తన టీమ్‌ను తయారు చేసి, వైసీపీ నేత రజాక్‌కు బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు రాజాసింగ్. శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం కూడా అమ్ముతున్నారని, ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేసి.. శ్రీశైల క్షేత్రాన్ని కాపాడాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.