Gossip Garage : సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ అరెస్ట్ ఖాయమా?
రెచ్చిపోయిన సంజయ్ తన రూటే సెపరేటు అన్నట్లుగా వ్యవహరించేవారట.

Gossip Garage Former CID Chief Sanjay (Photo Credit : Google)
Gossip Garage : సర్వ దరిద్రాలకు ఆయనే కారణం. అప్పటి ఓవరాక్షన్‌కు ఆద్యుడు కూడా అతనే. ప్రభుత్వ అధికారిని అని..తనకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని..పద్దతి పాడు అంటూ ఏడ్చి చచ్చిందని పట్టించుకోకుండా..అడ్డగోలుగా వ్యవహరించి..ఆఖరికి సస్పెండ్ అయిపోయారు ఆ అధికారి. గత సర్కార్ హయాంలో అధికార దుర్వినియోగం, ప్రజాధనం స్వాహా చేశారన్న విజిలెన్స్ రిపోర్ట్‌తో..అప్పటి సీఐడీ చీఫ్‌కు మంగళం పాడింది కూటమి ప్రభుత్వం. ఆ అధికారి అవినీతి కథకు అంతే లేదా? అప్పటి అక్రమార్జన అంతా రికవరీ చేస్తారా? సమగ్ర దర్యాప్తు తర్వాత కటకటాలు తప్పవా?
అధికార దుర్వినియోగం, నిధుల స్వాహా..
ప్రభుత్వాలు మారుతూ ఉంటాయ్. అధికారులే పర్మినెంట్. ఈ విషయాన్ని మర్చిపోయిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో ఉన్న ప్రభుత్వమే పర్మినెంట్ అనుకున్నారు. అందుకే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది చేసేశారట. అడ్డగోలు నిర్ణయాలు..అధికార దుర్వినియోగం, నిధుల స్వాహా చేస్తూ రాజ్యమేలారు. సరిగ్గా ఆరు నెలల కింద ప్రభుత్వం మారింది. అప్పటి అరాచకం ఫైల్స్ ఒక్కొక్కటి బయటికి రావడం స్టార్ట్ అయింది. అందులో మేయిన్ టాపిక్ మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌దే. ఆయన క్రైమ్ కహాని మామూలు స్టోరీ కాదు. పవర్ మిస్ యూజ్ చేయడం అంటే ఇంత సింపులా.? ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు పనిచేస్తే ఎంతైనా దోచుకోవచ్చా అని ఆయన రికార్డును చూస్తేనే అర్థమవుతోందట. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో ఉంటూ ఆయన చేసిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం లెక్కలు విజిలెన్స్ దర్యాప్తులో బయటపడ్డాయట. ఆ రిపోర్ట్ ఆధారంగా సంజయ్‌ని సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం.
కోట్ల రూపాయలు దారి మళ్లింపు..
జగన్ హయాంలో సంజయ్ సీఐడీ అదనపు డీజీగా, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సంస్థ డీజీగా పనిచేశారు. ఈ సమయంలో ఆయా విభాగాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అగ్ని-ఎన్‌వోసీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలతోపాటు నిబంధనల అమలులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించిందట. వైసీపీ హయాంలో అగ్నిపోర్టల్‌లో ఎన్‌వోసీ, హార్డ్‌వేర్ కోసం రూ.2.29 కోట్ల ఒప్పందం.. లాప్‌ట్యాప్‌లు, యాపిల్ ఐప్యాడ్‌ల వంటి పరికరాల కొనుగోలులో గోల్‌మాల్ అంతా బయటపడిందట. టెండర్లు లేకుండానే పని కానిచ్చేశారట. ఈ మొత్తం వ్యవహారంలో కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసినట్లు తెలుస్తోంది.
3 లక్షలు ఖర్చు చేసి.. కోటి 15లక్షలు దుర్వినియోగం..
ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణకు రూ.1.19 కోట్ల బడ్జెట్‌ను గత ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమాలను ఓ కంపెనీ పేరుతో నిర్వహించాలని..దానికి రిజిస్టర్ అడ్రస్ కూడా లేదంటున్నారు. అవగాహన సదస్సులకైన ఖర్చు కేవలం 3లక్షలు మాత్రమేనని విజిలెన్స్ తేల్చిందట. కానీ కోటి 15లక్షలు దుర్వినియోగం చేశారని గుర్తించారట. దాంతో సెంట్రల్ సర్వీస్ రూల్స్ ప్రకారం సంజయ్‌ను సస్పెండ్ చేశారు. అధికార దుర్వినియోగం, ప్రజాధనం స్వాహా, ప్రభుత్వ నిబంధనల అతిక్రమణ కింద చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో మెన్షన్ చేశారు. విజిలెన్స్ రిపోర్ట్‌లో గుర్తించిన అంశాలపై మరింత స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టబోతోందట.
అక్రమార్జన మొత్తాన్ని రికవరీ చేసే యోచనలో సర్కార్..
స్కిల్ స్కామ్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత..ఇప్పటి సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడంలో..అప్పుడు సీఐడీ చీఫ్‌గా ఉన్న సంజయ్ అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వ అధికారినన్న విషయం మర్చిపోయి..రూల్స్‌కు విరుద్దంగా ప్రెస్‌మీట్లు పెట్టడంతో పాటు.. సాక్ష్యాలు లేకుండా..విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుమారం లేపింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని అప్పట్లోనే టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజయ్..ట్రాక్ రికార్డు తీస్తే స్టోరీ అంతా బయటపడిందట. గత సర్కార్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేసుకుంటూ పోతూ..నిధులు స్వాహా చేశారట. ఇదంతా తెలిసినా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదట. రెచ్చిపోయిన సంజయ్ తన రూటే సెపరేటు అన్నట్లుగా వ్యవహరించేవారట. దాంతో ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేయడంతో పూర్తి డిటెయిల్స్ బయటికి తీసి..అక్రమార్జన మొత్తాన్ని రికవరీ చేయాలని భావిస్తోందట ఏపీ సర్కార్. చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం వరకు వెళ్తుందో.
Also Read : మంత్రులు ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబు ఎందుకు స్టార్ట్ చేసినట్లు?