AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సడెన్ షాక్.. సర్ప్రైజ్ రైడ్స్‌తో నిందితులకు ఝలక్
వేల కోట్ల రూపాయల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఈడీ రైడ్స్ చేయడం..పైగా ఐదుగురు కీలక నిందితుల టార్గెట్‌గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది.
- గతేడాది సెప్టెంబర్‌లోనే ఎంటర్ అయిన ఈడీ.!
- ఈడీ దూకుడుతో నిందితులకు హెడెక్ తప్పదా.?
- లిక్కర్ కేసులో పార్ట్-2 ఉండబోతోందా?
AP Liquor Scam: ఇక క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఫైనల్ ఛార్జిషీట్ మాత్రమే వేయాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న మొన్నటివరకు వినిపించిన మాట ఇది. కానీ ఈ కేసులో ఎప్పుడో ఎంటర్ అయిన ఈడీ ఇప్పుడు దూకుడు పెంచి సడెన్ షాక్ ఇచ్చింది. ఏకంగా ఐదుగురు నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయడంతో..లిక్కర్ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఈడీ లిక్కర్ లింకులను తెంచబోతోందా? లావాదేవీల గుట్టు విప్పనుందా?
ట్విస్టులే ట్విస్టులు. రోజుకో మలుపు. ఆ కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి ప్రతీ డెవలప్మెంట్ సంచలనమే. అరెస్ట్‌ల నుంచి రిమాండ్ల దాకా..నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి డిఫాల్ట్ బెయిల్ వరకు..బెయిల్స్ రద్దు నుంచి సిట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంతా నెక్స్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తే నిందితులకు పెద్ద చిక్కులను తెచ్చి పెట్టిందంటే..అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు ఈడీ దూకుడు పెంచడంతో..ఐదుగురు కీలక నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయడం ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్‌గా మారింది.
నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు..
రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతో పాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కేసులో ఎంటర్ అయిన ఈడీ..అప్పుడే ఐదు రాష్ట్రాల్లో రైడ్స్ చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ రైడ్స్ జరగడం అప్పట్లోనే నిందితులను ఆందోళనకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమ్ దర్యాప్తు చేస్తుండగానే..మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచడం చూస్తుంటే..ఏపీ లిక్కర్ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు లేటెస్ట్గా ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
ఈడీ స్పీడ్ తో నిందితుల్లో ఆందోళన..
వేల కోట్ల రూపాయల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఈడీ రైడ్స్ చేయడం..పైగా ఐదుగురు కీలక నిందితుల టార్గెట్‌గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో..ఈ స్టేజ్‌లో ఈడీ స్పీడ్ పెంచడం చూస్తుంటే లిక్కర్ లింకుల నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసుల్లో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు మరికొందరు బెయిల్ మీదున్నారు. గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ రాగా..హైకోర్టు కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.
ఆ అలిగేషన్స్ అలా కొనసాగుతుండగానే..ఈడీ సోదాలు నిందితులకు హెడెక్‌గా మారాయి. మనీలాండరింగ్ అంటూ ఈడీ కేసులు నమోదు చేస్తే.. ఈ కేసు మరంత జఠిలమయ్యేలా కనిపిస్తోంది. ఈడీ దర్యాప్తు స్పీడప్ కావడంతో..ఈ కేసు ఎవరి టార్గెట్‌గా ముందుకు కదులుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొన్న కీలక వ్యక్తులు అందరూ అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇంకా ముగ్గురు, నలుగురికి సిట్ కేసుల్లో బెయిల్ రావాల్సింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు రూ. 3,500 కోట్ల కుంభకోణం జరిగిందనేది సిట్ మెయిన్ అలిగేషన్. అయితే ఇక్కడ లిక్కర్ సేల్స్‌తో వచ్చిన నిధులను హవాలా రూపంలో విదేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్‌గా చేశారన్నది ఈడీ అభియోగం. ఇప్పటి వరకు సిట్ దాఖలు చేసిన చార్జిషీట్లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారట. మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించినట్లు టాక్. ఆల్ మోస్ట్ లిక్కర్ కేసు చివరిదశకు చేరుకుంటుందనుకుంటున్న టైమ్‌లో..ఈడీ ఎంటర్ దూకుడు అయితే..బిగ్ టర్న్‌గా చెప్పొచ్చు. ఈడీ వేట..లిక్కర్ లింకులను ఎలా తెంచుతుందో.. మనీలాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారో చూడాలి.
Also Read: సింహాచలం చందనోత్సవంలో కనిపించని గంటా.. ఎందుకీ దూరం, మౌనం?
