Kethireddy Venkatramireddy: మళ్లీ సైలెంట్ అయిపోయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..! సొంత పార్టీ నేతతో ఉన్న గ్యాపే కారణమా?
ఇప్పుడు మళ్లీ కేతిరెడ్డి ఎక్కడా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన మళ్లీ సైలెంట్ కావడానికి వైసీపీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలే కారణమా లేక మరేదైనా రీజన్ ఉందా.? అనే చర్చ మొదలైంది.
- ఆ మధ్య ప్రెస్మీట్లు, ఆందోళనలతో హడావుడి..
- కేతిరెడ్డి మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లినట్లు?
- తోపుదుర్తితో గిట్టకనే మౌనంగా ఉండిపోతున్నారా.?
- కేతిరెడ్డి, తోపుదుర్తి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా.?
Kethireddy Venkatramireddy : ఏపీ వైసీపీలో ఆ లీడర్ స్టైలే వేరు. ఎడ్యుకేటేడ్. వాస్తవాలకు దగ్గరగా..ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తతత్వం ఉన్న ఆయన..గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత తెరమీదకు వచ్చి ప్రెస్మీట్లు, ఫీల్డ్‌లో ఆందోళనలు, కూటమి సర్కార్‌పై అటాక్ చేస్తూ లైమ్‌లైట్‌లో కొనసాగారు. ఇప్పుడేమైందో ఏమో తెలియదు కానీ మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఆ మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఎందుకు గమ్మున ఉండిపోతున్నట్లు.? సొంత పార్టీ నేతతో ఉన్న గ్యాపే కారణమా.?
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే కేతిరెడ్డి..ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ప్రెస్మీట్లు, ఆందోళనలు, క్యాడర్‌తో మీటింగ్‌లు పెట్టి లైమ్‌లైట్‌లో కనిపించారు. ఇప్పుడు మళ్లీ కేతిరెడ్డి ఎక్కడా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన మళ్లీ సైలెంట్ కావడానికి వైసీపీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలే కారణమా లేక మరేదైనా రీజన్ ఉందా.? అనే చర్చ మొదలైంది.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మధ్య వైరం నడుస్తోందట. ధర్మవరంలో రాప్తాడు నియోజకవర్గం వైసీపీ పార్టీ ప్రారంభిస్తానని ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందట. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే తోపుదుర్తి, కేతిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతుందని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక ధర్మవరంలో పార్టీ ఆఫీస్‌ను పెడుతానంటూ తోపుదుర్తి ప్రకటించడంతో కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ధర్మవరంలో ఆఫీస్ పెట్టడం ఎందుకు..ఫోన్ ఎత్తి సమాధానం చెప్తే సరిపోతుంది కదా అంటూ సెటైర్ వేశారు. ముందుగా రాప్తాడులో పార్టీ ఆఫీస్ పెట్టుకోమనంటూ అంటూ కేతిరెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
ఓ మాజీ ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు..
అయితే కేతిరెడ్డిపై పైచేయి సాధించే ఉద్దేశంతో ఎలాగైనా ధర్మవరం వైసీపీకి కొత్త నాయకుడిని తేవాలని తోపుదుర్తి ఇంటర్నల్‌గా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేతిరెడ్డి ప్రత్యర్థి అయిన అంగబలం, అండ బలం ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రకాష్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ధర్మవరంలో కేతిరెడ్డిని కాదని వైసీపీ అధిస్టానం మరొకరికి అవకాశం ఇస్తుందా? అంతటి సాహసం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి వైసీపీ అధిష్టానంతో మంచి సంబంధాలే ఉన్నాయట. కేతిరెడ్డి దూకుడు, ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్వం చూసిన అధిష్టానం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని చూసిందట. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీలకు కేటాయించినట్లు చెబుతున్నారు. ధర్మవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారతారని గుసగుసలు వినిపించాయి.
రాజకీయాలలో గెలుపోటములు సహజం అంతమాత్రాన కన్నతల్లి లాంటి పార్టీని వీడుతామా అంటూ..తాను వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటానని ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు కేతిరెడ్డి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అప్పుడు 2.Oలో తామేంటో చూపిస్తామంటూ వైసీపీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే కేతిరెడ్డి ఎప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వస్తారోనని ఎదురు చూస్తోంది ధర్మవరం వైసీపీ క్యాడర్.
రెడ్డి సామాజిక వర్గానికి అమాత్యయోగం దక్కకపోవడానికి కేతిరెడ్డే కారణం?
ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ప్రకాశ్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తోందట. అప్పట్లో మంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య కాస్త డిఫరెన్సెస్ వచ్చాయట. వైసీపీ హయాంలో జిల్లాలో కురుమ సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడానికి, రెడ్డి సామాజిక వర్గానికి అమాత్యయోగం దక్కకపోవడానికి కేతిరెడ్డే కారణమని అని తోపుదుర్తి కినుక వహించారట. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ నడుస్తోందట. అదీకాక ధర్మవరం వైసీపీ టికెట్‌ను గోరంట్ల మాధవ్‌కు ఇప్పించాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కాస్త గట్టిగానే ట్రై చేశారట. ఈ ఇష్యూతో కేతిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. ఓ వైపు పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండగా..నేతల గొడవతో తమను ముందుండి నడిపించే నాయకులు లేరని..క్యాడర్ ఆందోళన చెందుతోందట. ఇప్పటికైనా కేతిరెడ్డి యాక్టివ్ మోడ్‌లోకి వచ్చి..ధర్మవరం పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.
