ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన కుర్చీలు, బల్లల పంచాయితీ..! అసలేంటీ వివాదం..
జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్లు, ఫ్యాన్లు, లైట్లు, కరెంట్ సామాన్లకు రూ.73 లక్షలు ఖర్చు చేశారని..

Furniture War : అసలే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంశం ఏదైనా అవకాశం దొరికితే చాలు ఒకరి మీద ఒకరు ఒంటి కాలు మీద లేస్తున్నారు. పైగా ఇప్పుడు కుర్చీలు, బల్లల పంచాయితీ సీన్ మార్చేస్తోంది. వచ్చి తీసుకుపోండి అని వాళ్లు, దొంగ నాటకాలు వద్దని వీళ్లు.. ఒకరికి ఒకరు ఇచ్చి పడేసుకుంటున్నారు. కోడెల శివప్రసాద్ విషయంలో ఏం చేశారో మర్చిపోయారా? ఇప్పుడు నీతులు చెబుతున్నారు అంటూ వైసీపీని ఏకిపారేస్తోంది టీడీపీ. వైసీపీ మాత్రం వరుస పెట్టి లేఖలు రాస్తూ వస్తోంది. దాంతో ఇప్పుడు ఏపీలో ఫర్నీచర్ పంచాయితీ పీక్స్ కి చేరింది. అసలేంటి.. కుర్చీలు, బల్లల పంచాయితీ? వైసీపీ వాదన ఏంటి? టీడీపీ అటాక్ లో లాజిక్ ఉందా?
కూటమి సర్కార్ ఫర్నీచర్ పంచాయితీతో మాజీ సీఎం జగన్ ను కార్నర్ చేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావొస్తున్నా.. ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య ఫర్నీచర్ ఫైట్ కొలిక్కి రావడం లేదు. ఫర్నీచర్ వ్యవహారమే టార్గెట్ గా టీడీపీ ట్వీట్లు చేయడం, దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం కాక రేపుతోంది.
మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ లోని ఫర్నీచర్ అంశం రచ్చకు దారితీసింది. జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నీచర్ టార్గెట్ గా టీడీపీ చేసిన ట్వీట్లు కాక రేపుతున్నాయి. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు అంటూ అటాక్ స్టార్ట్ చేసింది టీడీపీ. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసును సెక్రటేరియట్ ఫర్నీచర్ తో నింపేశారని, పదవి పోయిన తర్వాత కూడా ఫర్నీచర్ ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా వాడుకుంటున్నారని విమర్శిస్తోంది.
జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్లు, ఫ్యాన్లు, లైట్లు, కరెంట్ సామాన్లకు రూ.73 లక్షలు ఖర్చు చేశారని.. ఇంటి రెయిన్ ప్రూఫ్ పీవీసీ పగోడాస్, మొబైల్ టాయ్ లెట్స్ కి రూ.22.50 లక్షలు వాడారని అప్పటి జీవో కాపీలను బయటపెట్టింది టీడీపీ. ఇలా జగన్ ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని, ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి ఇచ్చేయాలి కదా అని ప్రశ్నించింది టీడీపీ. అంతేకాదు త్వరలో అన్నీ బయటకు వస్తాయంటూ మరింత హీట్ పెంచింది టీడీపీ.
పూర్తి వివరాలు..
Also Read : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..