తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..

అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..

Updated On : October 4, 2024 / 8:09 PM IST

Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర దర్యాఫ్తునకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. సిట్ ఏర్పాటు చేయాలని చెప్పింది. దీంతో ఈ వ్యవహారంలో నెక్ట్స్ ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. అసలు కల్తీ జరిగిందా? లేదా? అనేది ఎలా తెలుస్తుంది.. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి? లడ్డూ వివాదంలో తర్వాత ఏం జరగనుంది? అనే అంశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”6-7-24.. 12-7-24 వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ లో జంతువుల కొవ్వు కలిసింది కాబట్టి వాటిని ఉపయోగించలేదు అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఏఆర్ డెయిరీ వాళ్లు ఇంతకుముందు సప్లయ్ చేసిన నాలుగు ట్యాంకర్ల గురించి. సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఆ లడ్డూ శాంపుల్స్ ను మీరు అనాలసిస్ కు పంపించారా? అని అడిగింది. అంటే, తయారైన లడ్డూలు ఉపయోగించబడాయి, పంపిణీ అవుతాయి. టెస్టింగ్ కోసం.. 6-7.. 12-7 మధ్య వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడారు. అయితే లడ్డూల తయారీకి వాటిని వాడలేదని స్పష్టంగా చెప్పారు.

కల్తీ జరిగిన నెయ్యితో మొదటిది.. ఇంతకుముందు వచ్చిన 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందా? ఆ తర్వాత ఆ నెయ్యిని ఉపయోగించినట్లే తెలుస్తోంది. డౌట్ వచ్చింది ఈ ట్యాంకర్లలో కాబట్టి.. వాటిని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడు చూడాలి. అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఏదైతే కంపెనీ సప్లయ్ చేస్తుందో వాళ్లు ఈ ట్యాంకర్స్ తో పాటు ఒక ల్యాబ్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలి. అది కూడా NABL గుర్తింపు ఉన్న ల్యాబ్ అయి ఉండాలి.

Also Read : తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం

మరి ఆ తెచ్చిన టెస్ట్ రిపోర్టులో అడల్ట్రేషన్ గురించి టెస్ట్ ఉందా లేదా అన్నది మనం చూడాలి. గ్యాస్ క్రొమోటోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే ఇతర ఆయిల్స్ ఏవైనా మిక్స్ అయ్యిందా లేదా అని తెలుస్తుంది. ఆ ఎక్విప్ మెంట్ ఖరీదు సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఉంటుంది” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

పూర్తి వివరాలు..