Pawan Kalyan: పవన్ కల్యాణ్ సరికొత్త పాలిటిక్స్..! జెన్ జీ సెంట్రిక్‌గా సేనాని మాస్టర్ ప్లానేంటి?
ఏపీ పాలిటిక్స్‌లో భవిష్యత్ లీడర్‌గా కనిపిస్తున్న పవన్..జెన్ జీ యువతతో నిర్వహించిన ఇంటరాక్టీవ్ సెషన్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓట్ల కోసమో.. లేక వారిని పార్టీవైపు అట్రాక్ట్ చేయడానికే పరిమితం కాకుండా, రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద్దేశంతో సాగిన మీటింగ్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది.
- లేటెస్ట్ ట్రెండ్..ఫ్యూచర్ ప్లానింగ్‌తో పవన్ పాలిటిక్స్
- జెన్-జీ సెంట్రిక్‌గా సేనాని రాజకీయ వ్యూహాలు..!
- అన్ని పార్టీల కంటే ముందే జెన్ జీపై పవన్ ఫోకస్
- నవ యువతను పార్టీకి పునాదిగా చేసుకునే స్కెచ్
- 20ఏళ్లలోపు యువత మైండ్ సెట్‌ను స్టడీ చేసే పనిలో పవన్
- జనసేన స్కూల్లో భవిష్యత్ నేతలను తయారు చేసే ప్లాన్
Pawan Kalyan: పార్టీ అన్నాక ఓ క్యాడర్ ఉంటుంది. లీడర్లు ఉంటారు. జనసేన అలా కాదు. అదో సైన్యం. పవన్ అభిమాన గణం సమూహం. అయితే తనను అభిమానించే వారే కాదు.. ఇప్పటి తరం యువతను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు జనసేన అధినేత. పార్టీ లాంగ్ టర్మ్‌లో నిలదొక్కుకునేలా..ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేసేలా జెన్ జీ యూత్‌పై కాన్సంట్రేట్ చేశారు పవన్. జనసేన స్కూల్ నుంచి ఫ్యూచర్ లీడర్లు పుట్టుకొచ్చేలా బిగ్ స్కెచ్చే వేస్తున్నారట. జెన్ జీ సెంట్రిక్‌గా సేనాని మాస్టర్ ప్లానేంటి? పవన్ సరికొత్త పాలిటిక్స్‌కు తెరలేపారా?
అప్పుడు పోరాటం. ఇప్పుడు అధికారం. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో..ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. కానీ పార్టీ అన్నది పది కాలాల పాటు నిలబడాలి. ప్రజల కోసమే పనిచేయాలి. అందుకోసం పార్టీకి బలమైన పునాదులు వేసే పనిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భవిష్యత్ నాయకులను అందించేందుకు..జనసేన ఓ చెక్కు చెదరని పార్టీగా నిలబడేందుకు పకడ్బందీ వ్యూహాలే రచిస్తున్నారు. ఆ మధ్య జనసేన పొలిటికల్ స్కూల్ అంటూ ప్రచారం జరిగింది. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ..ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ వైపు అట్రాక్ అవుతున్న యువతకు..పార్టీ సిద్ధాంతాలు, ప్రజల అవసరాలు, రాజకీయాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పించే ప్లాన్ చేస్తున్నారు. అసలైన ప్రజా సేవకులుగా పాలిటిక్స్‌లోకి రావాలని యువతకు సూచిస్తున్నారు పవన్.
భవిష్యత్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్ స్ట్రాటజీ..
ఈ క్రమంలోనే ఆయన జెన్ జీ యూత్‌పై స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. భవిష్యత్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్ జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. జెన్ జీ యువత సరికొత్తగా ఆలోచిస్తోందని..వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన జెన్ జీతో ఇంటరాక్ట్ అయ్యారని అంటున్నారు.
జెన్ జీలను తమ వైపునకు తిప్పుకునే వ్యూహం..
జెన్ జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఓ రివెల్యూషన్గా మారింది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరును నిరసిస్తూ యువ కెరటాలు కన్నెర్ర చేయడంతో రాత్రికి రాత్రే ప్రభుత్వాలు గద్దె దిగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా అన్ని రాజకీయ పార్టీలు జెన్ జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. కానీ అందరి కంటే ముందు ఓ అడుగు ముందుకేసి..పవన్ జెన్ జీ సెంట్రిక్‌గా పాలిటిక్స్ చేసేందుకు ఇన్ సైడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్‌ను జెన్ జీగా పిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా ఉన్న జెన్ జీలను తమ వైపునకు తిప్పుకోవాలనేది జనసేన ప్రత్యేక వ్యూహంగా ఉంది. అందుకే ఇప్పుడిప్పుడే ఓటర్లుగా మారుతున్న యువత ఆలోచనలను తెలుసుకునేందుకు పవన్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు.
ఏపీ పాలిటిక్స్‌లో భవిష్యత్ లీడర్‌గా కనిపిస్తున్న పవన్..జెన్ జీ యువతతో నిర్వహించిన ఇంటరాక్టీవ్ సెషన్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓట్ల కోసమో.. లేక వారిని పార్టీవైపు అట్రాక్ట్ చేయడానికే పరిమితం కాకుండా, రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద్దేశంతో సాగిన మీటింగ్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది. ‘జనసేనానితో జన్ జడ్’ పేరుతో జరిగిన సమావేశం దాదాపు 3 గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. కేవలం స్పీచ్‌లకే పరిమితం కాకుండా, యువతతో ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించడం, యువత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రాజకీయ సభలు అంటే వేదిక మీదున్న వాళ్లు మాట్లాడటమే తప్ప..డయాస్ ముందున్న వాళ్లతో మాట్లాడించే అవకాశాలు తక్కువ. మరీ యువతకు మైక్ ఇవ్వాలంటే జంకుతుంటారు లీడర్లు. కానీ ఈ జెన్ జడ్ మీటింగ్ పూర్తిగా డిఫరెంట్‌గా సాగింది. ఒక కార్పొరేట్ బోర్డ్ రూమ్ డిస్కషన్లా పవన్ యువతతో ఇంటరాక్ట్ అవ్వడం ఆకట్టుకుంది.
రాజకీయాల్లోకి రావాలంటే కేవలం డబ్బు, బలం ఉంటే సరిపోదని బలమైన వ్యక్తిత్వం ఉండాలని పవన్ దిశానిర్దేశం చేయడం యువతను ఆకర్షించిందని అంటున్నారు. అయితే జన్ జీతో పవన్ మీటింగ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొదటిసారి ఓటు వేసే యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? పార్టీల పై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకోడానికే పవన్ ఈ సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. ఫస్ట్ టైమ్ ఓటర్స్ కింగ్ మేకర్స్‌గా, డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న పవన్, ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేసేందుకు మిగిలిన నాయకుల కంటే ఒక అడుగు ముందే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. జెన్ జీ యువతతో పవన్ ఇంటరాక్షన్ ఒక రోజు ముచ్చటగా మిగిలిపోతుందా లేక ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి.
Also Read: ఏపీలో లోకల్ ఫైట్.. వైసీపీ ముందున్న సవాళ్లు ఏంటి? ఎలా ఎదుర్కోబోతోంది?
