Nandyala Vijaya Dairy: సై అంటే సై.. కుర్చీ కోసం మామ, కోడలు ఫైట్.. పంతం నెగ్గించుకునేదెవరు?
ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Nandyala Vijaya Dairy: నంద్యాల రాజకీయం వేరు. పైగా భూమా వర్సెస్ ఎస్వీ పాలిటిక్స్ సమ్‌థింగ్ డిఫరెంట్. విజయ డెయిరీ కేంద్రంగా..మేనమామ, మేనకోడలు మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. తమ్ముడిని డెయిరీ ఛైర్మన్‌గా చేసేందుకు ఎమ్మెల్యేగా ఉన్న ఆ అక్క తపన పడుతుంటే.. పట్టు నిలుపుకునేందుకు..విజయ డెయిరీ ఛైర్మన్ ఫైట్ చేస్తున్నారు. ఈ రచ్చ ఇలా నడుస్తుండగానే..మరో పెద్ద ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఏకంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి విజయ డెయిరీ కుట్ర చేస్తోందన్న టీడీపీ ఆరోపణలు..రాజకీయ వేడిని రాజేస్తున్నాయ్. అసలు నంద్యాల విజయ డెయిరీలో ఏం జరుగుతోంది? మామ, కోడలు ఫైట్‌లో పంతం నెగ్గించుకునేదెవరు?
నంద్యాల విజయ డెయిరీ వేదికగా టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. విజయ డెయిరీని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ..ఇప్పటికే తమ నేత ఛైర్మన్‌గా ఉన్న విజయ డెయిరీని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ తెగ ఆరాట పడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్సెస్ విజయ డెయిరీ ఛైర్మన్ వైసీపీ నేత ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డిని విజయ డెయిరీ ఛైర్మన్ చేయాలని అనుకుంటున్న అఖిలప్రియ..మేనమామ ఎస్వీ జగన్ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే తన సీటును కాపాడుకోవడంతో పాటు..వైసీపీ పట్టు నిలుపుకోవడం కోసం ఎస్వీ జగన్ మోహన్‌రెడ్డి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి కుట్ర?
ఈ రాజకీయ రచ్చ నడుస్తుండగా.. నంద్యాల విజయ డెయిరీ భూములను కొట్టేసే ప్లాన్ అంటూ ఓ ప్రచారం హల్‌చల్ చేస్తోంది. దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు విజయ డెయిరీ పాలకవర్గం సిద్ధమైంది. వైసీపీ లీడర్ల ఆధ్వర్యంలోని పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలకు, సహకార శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో పాడి రైతుల కోసం 1974లో రాష్ట్ర ప్రభుత్వం డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతుల నుంచి పాలు సేకరించి, విక్రయించేది. ఆ తర్వాత కార్పొరేషన్ స్థానంలో 1981లో ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ‘విజయ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల విజయ డెయిరీకి ప్రభుత్వం స్థలం ఉంది. ఆ 35 ఎకరాల స్థలాన్ని ఇప్పుడు విజయ డెయిరీ పాలకవర్గం అమ్మేందుకు రెడీ అయ్యిందట. ఆ భూమి విలువ రూ.300 కోట్లు ఉంటుందని చెబుతోంది టీడీపీ. డెయిరీ భూములు ప్రభుత్వానివి కావంటూ లేఖ..
ఏపీ సహకార శాఖ అధికారులతో కుమ్మక్కై వైసీపీ నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొట్టేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే డెయిరీ భూములు ప్రభుత్వానివి కావంటూ సహకార అధికారి ఇచ్చిన లేఖ దుమారం రేపుతోంది. సహకార శాఖ అధికారి ఇచ్చిన లేఖ ఆధారంగా ఆస్తుల విక్రయానికి పావులు కదుపుతోందట వైసీపీ నేతల ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాలకవర్గం. ఇప్పటికే డెయిరీ ఆస్తుల విక్రయానికి ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు కూడా జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
2020 నాటికి నంద్యాల విజయ డెయిరీకి రూ.25 కోట్ల అప్పులు ఉంటే, ఈ ఐదేళ్లలో ఆ అప్పు రూ.100 కోట్లకు చేరిందంటున్నారు. అప్పుల ముసుగులో డెయిరీ ఆస్తులు అమ్మేందుకు పాలకవర్గం కుట్ర చేస్తోందనేది టీడీపీ వాదన. నంద్యాలలో 30 ఎకరాలు, కర్నూలులో 5 ఎకరాల డెయిరీ భూమిని అమ్మకానికి పెట్టారని అంటున్నారు. అయితే అవి ప్రభుత్వ భూములు కాదంటూ సహకార శాఖ అధికారి ఇచ్చిన లేఖపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా? లేక విజయ డెయిరీ పాలక వర్గం పంతం నెగ్గించుకుంటుందా అనేది చూడాలి.
Also Read: మొన్న నెయ్యి.. నిన్న చోరీ.. ఇప్పుడు.. తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో బిగ్ స్కామ్?
