Cm Chandrababu: ముందు పురపోరు.. తర్వాతే పల్లెపోరు..? స్థానిక ఎన్నికలపై కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్..!
మార్చిలోనే మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2నే గ్రామ పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయింది. జూన్‌లో జిల్లా మండల పరిషత్తుల పదవీకాలం కూడా ముగియనుంది.
- స్థానిక ఎన్నికలపై కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్..!
- ముందు పురపోరు..తర్వాత పరిషత్, పంచాయతీ ఎలక్షన్స్.?
- కొత్త ఎలక్షన్ కమిషనర్ నియామకం తర్వాత ప్రాసెస్ స్పీడప్.!
- స్థానిక యుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న కూటమి
- పురపోరుతో స్టార్ట్ చేసి పల్లె పోరుతో లోకల్ ఫైట్‌ను ముగించే ప్లాన్
Cm Chandrababu: స్టేట్ ఈసీ చీఫ్ పదవీకాలం ముగిసిపోయింది. కొత్త కమిషనర్ పోస్టింగ్‌కు కూడా కసరత్తు నడుస్తోంది. దీంతో ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక పోరుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో అధికారుల పాలన నడుస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు కూడా ముగిసింది. ఎప్పటినుంచో ఎన్నికలకు ప్రిపరేషన్స్ జరుగుతున్నా..లేటెస్ట్ డెవలప్మెంట్స్..లోకల్ బాడీ పోల్స్‌పై అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా మార్చేస్తున్నాయి. స్థానిక ఎన్నికల విషయంలో కూటమి సర్కార్ ప్లానేంటి? ముందు పురపోరు ..తర్వాత పరిషత్..చివరికి పల్లెపోరు కోసం..రూట్‌మ్యాప్ రెడీ చేసి పెట్టారా?
స్థానిక పోరు, మున్సిపల్ ఎన్నికలపై ఏపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆరు నెలలుగా ఏపీలో లోకల్ ఫైట్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని..కూటమి సర్కార్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే చాలా మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. ఇక నెలలోనే పంచాయతీల పాలకవర్గాలు గడువు కూడా ముగిసింది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికలపై ఓ హింట్ ఇచ్చారు. ఆరు నెలల్లోపు లోకల్ పోల్స్ నిర్వహిస్తామని..రెడీగా ఉండాలని..మంత్రులు, కూటమి క్యాడర్‌కు ఇండికేషన్ ఇచ్చారు. ఇంతలోనే ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం ముగిసింది. కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీలో రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీని చిత్తు చేసి మరీ 95 శాతం స్ట్రైక్ రేటుతో బంపర్ సక్సెస్ కొట్టిన టీడీపీ, కూటమికి..ఈ మధ్యకాలంలో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఏ రకమైన అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు అటువంటి సందర్భం రాబోతోందని అంటున్నారు. ఏపీలో లోకల్ బాడీలకు ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది.
మున్సిపల్ జోరుతో పరిషత్, పల్లె పోరు పెట్టే యోచన..
మార్చిలోనే మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 2నే గ్రామ పంచాయతీల పదవీ కాలం కంప్లీట్ అయింది. జూన్‌లో జిల్లా మండల పరిషత్తుల పదవీకాలం కూడా ముగియనుంది. దాంతో ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ఒక పక్కా ప్లాన్‌తో వెళ్తోంది. ముందుగా పట్టణాలలోనే జనం పల్స్ తెలుసుకోబోతోందట. మొదటి నుంచి టీడీపీకి అర్బన్ ఏరియాలో మంచి పట్టు ఉంది. వైసీపీ పుట్టిన నాటి నుంచి రూరల్ బేస్‌లోనే బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ విక్టరీని కొడతామని గట్టిగా చెప్పుకుంటున్న టీడీపీ కూటమి మున్సిపల్ పోరుతోనే విజయ యాత్ర స్టార్ట్ చేయాలని భావిస్తోందట.
లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై ఇప్పటికే క్యాబినెట్లో చరించారని అంటున్నారు. మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు..త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని ఒక అభిప్రాయానికి వచ్చారట. దాంతో పాటు ముందుగా పదవీకాలం పూర్తి అయింది కాబట్టి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నుంచే ఎన్నికల నగారా మోగించాలని చూస్తున్నారట. వందకు పైగా మున్సిపాలిటీలు..దాదాపు డజన్‌కి పైగా కార్పొరేషన్లలో ముందుగా ఎన్నికలు పెట్టి..సత్తా చాటాలనేది కూటమి సర్కార్ ప్లాన్ అని చెబుతున్నారు.
భారీ విజయాలు నమోదు చేయాలని ఆదేశం..
ఆగస్ట్ వరకు పురపోరును కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయిందని అంటున్నారు. అప్పటిలోగా బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలని భావిస్తున్నారట. ఇక మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలను నమోదు చేయాలని ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి సిద్ధం అయిపోవాల్సిందేనని చంద్రబాబు చెప్పేశారు. మొత్తం మీద చూస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటును సాధించి..అదే ఊపులో మండల, జిల్లా పరిషత్‌లు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.
Also Read: సడెన్‌గా.. పెద్దాయన డెత్ స్టోరీని ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? టీడీపీ స్కెచ్ ఏంటి?
