పంచాయతీ ఎన్నికలకు మేము రెడీ- సజ్జల రామకృష్ణా రెడ్డి

పంచాయతీ ఎన్నికలకు మేము రెడీ- సజ్జల రామకృష్ణా రెడ్డి

Updated On : January 25, 2021 / 7:17 PM IST

government ready for local body elections-sajjala : ఏపీ స్ధానిక సంస్ధల ఎన్నికలకు ప్రభుత్వం సహకరిస్తుందని ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి చెప్పారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఫ్రారంభిస్తామని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికలకు వైసీపీ ఎప్పడూ సిధ్దంగానే ఉందని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, పోటీ చేయటానికి, గెలవటానికి వైసీపీ ఎప్పడూ సిధ్దంగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఎస్ఈసీ మొండి వైఖరితో  ఎన్నికలకు వెళ్తున్నందున ఆ  సమయంలో జరగరానిదేదైనా జరిగితే ఎస్ఈసీ దే బాధ్యత అని ఆయన  అన్నారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకే సారి ఎలా చేయాలనే దానిపై కేంద్రంతో చర్చిస్తామని ఆయన తెలిపారు.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించటంలోనే కుట్ర కోణం కనపడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయమని కోరామే తప్ప వేరే కారణం లేదని అన్నారు. ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎన్నికలను పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించటంలోనే దురుద్దేశం కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు.