Andra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది.

Andra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Jobs

Updated On : July 29, 2021 / 5:51 PM IST

Govt of Andra Pradesh PUBLIC SERVICES: జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల కోసం కొత్తగా 1180 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ ప్రభుత్వం.

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఈమేరకు ఆర్థిక శాఖ ఆమెదముద్ర వేసింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా లేటెస్ట్‌గా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టంచేసింది.

ఈ పోస్టులంన్నిటికీ ఆగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్(ఈబీసీ)ను వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది ఏపీపీఎస్సీ.