Nellore Crime : బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారయత్నం చేశాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Nellore Crime
Nellore Crime : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారయత్నం చేశాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు సుధాకర్.
బాలిక తండ్రిని సమీపంలోని ఓ షాపుకి పంపించి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్. బాలిక ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో బాలికపై అత్యాచారయత్నం చేసినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి : Nellore Lorry Hits Auto : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆటో.. ప్రయాణికుల కోసం గాలింపు