Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చావు ఖాయం..! నెల్లూరులో 500 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం, అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం

నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేపట్టారు. భారీగా కుళ్లిన, నిల్వ చేసిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. హరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 500 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు.

Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చావు ఖాయం..! నెల్లూరులో 500 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం, అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం

Updated On : December 24, 2022 / 10:36 PM IST

Nellore Rotten Chicken : నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేపట్టారు. భారీగా కుళ్లిన, నిల్వ చేసిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. హరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 500 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు. పురుగు పట్టి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ ను గుర్తించిన అధికారులు.. దానిపై ఫినాయిల్ పోసి ఆ చికెన్ ను నిర్వీర్యం చేశారు.

అనంతరం వేస్ట్ చికెన్ ను డంపింగ్ యార్డుకు తరలించారు. అంజాద్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఆ చికెన్ ను చెన్నై, కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చి జిల్లాలోని పలు షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోడౌన్ ను అధికారులు సీజ్ చేశారు.

Also Read..Rotten Chicken And Meat : వామ్మో.. ఈ చికెన్ తింటే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే..! నెల్లూరులో మళ్లీ కుళ్లిన మాంసం కలకలం

చికెన్‌ పేరు చెప్పగానే మాంసం ప్రియులకు నోరూరుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ టేస్ట్ చేయాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. అయితే, కొందరు వ్యాపారులు స్వార్థంతో, కాసుల కక్కుర్తితో ఇలా కుళ్లిన చికెన్ ను విక్రయిస్తున్నారనే విషయం వెలుగుచూడటంతో చికెన్ ప్రియులు షాక్ అయ్యారు.

చికెన్‌ పేరు చెబితే వెన్నులో వణుకుపుడుతోంది. ప్రస్తుతం నెల్లూరులో ఇలాంటి పరిస్థితే ఉంది. రోజులు తరబడి కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్నారనే నిజం తెలిసి బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లు తాము తిన్నది పరిశ్రుభమైన చికెనో కాదో అని కంగారుపడుతున్నారు.

Also Read..Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చిక్కులే.. నెల్లూరులో కుళ్లిన చికెన్ విక్రయాలు, తనిఖీల్లో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

చెన్నై, కోయంబత్తూరు నుంచి తక్కువ ధరకు కుళ్లిపోయిన మాంసాన్ని దిగుమతి చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. హెల్త్ అధికారుల ఆకస్మిక దాడుల్లో 500 కేజీల కుళ్లిన చికెన్‌ బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పురుగులు పట్టిన మాంసాన్ని చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకందారులపై కేసులు నమోదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా, చర్యలు తీసుకుంటున్నా.. కుళ్లిన చికెన్ అమ్మే మాంసం ముఠాల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. చెన్నై నుంచి తక్కువ రేటుకి కుళ్లిన చికెన్ తీసుకొచ్చి నెల్లూరులో విక్రయించి కొందరు నీచులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.