health-screening : ఏపీలో ఇంటి వద్దకే వైద్యం

  • Published By: madhu ,Published On : September 28, 2020 / 10:16 AM IST
health-screening : ఏపీలో ఇంటి వద్దకే వైద్యం

Updated On : September 28, 2020 / 11:32 AM IST

health-screening : ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..వారి ఆరోగ్య వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది ANMలు 2020, సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లనున్నారు.




వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారని అంచనా. ఇందులో ఏడు రకాల జబ్బులను గుర్తించి..వైద్య చికత్స అందించే లక్ష్యంగా పెట్టుకుంది. యాప్‌ ద్వారా డేటాను నమోదు చేస్తారు.

ఏడు రకాల జబ్బులు : మధుమేహం. హైపర్‌ టెన్షన్‌. లెప్రసీ (కుష్టువ్యాధి) లక్షణాలు. క్షయ ప్రాథమిక లక్షణాలు. నోరు, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు లాంటివి. చిన్నారులు, మహిళల్లో రక్తహీనత. చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి చికిత్స అందేలా చర్యలు.
5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్‌ చేస్తారు.




ఎవరికి ఎలాంటి జబ్బులు, లక్షణాలున్నాయో గుర్తిస్తారు. ఎలాంటి చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపిస్తారు. ఏఎన్‌ఎంలు సేకరించే హెల్త్‌ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి పౌరుల ఆరోగ్య వివరాలను భద్రపరుస్తారు.