ఏపీకి భారీ వర్ష సూచన

Heavy rain forecast : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరిన్ ప్రాంతంలో ఉపతల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
సోమవారం నవంబర్ (16, 2020) దక్షిణ కోస్తా తీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికే బుతు పవనాలు బలంగా ఉండటంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.