Kuwait: కువైట్‌లో ఏజెంట్ల ఆగడాలు.. నరకం చూస్తున్న శ్రావణి.. సెల్ఫీ వీడియో వైరల్

కువైట్‌లో పనికోసం వెళ్లిన వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెంట్ల ఆగడాలతో నరకం చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నా.. అడ్డుకట్ట పడటం లేదు. ఉపాధికోసం మహిళలుసైతం కువైట్ వెళ్తుంటారు. ఏజెంట్ల ద్వారా ఆ దేశానికి వెళ్లి అక్కడ పనులు చేసుకుంటుంటారు. ఈ తరహాలోనే తిరుపతి జిల్లా ...

Kuwait: కువైట్‌లో ఏజెంట్ల ఆగడాలు.. నరకం చూస్తున్న శ్రావణి.. సెల్ఫీ వీడియో వైరల్

Srawani

Updated On : May 31, 2022 / 10:23 AM IST

Kuwait: కువైట్‌లో పనికోసం వెళ్లిన వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెంట్ల ఆగడాలతో నరకం చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నా.. అడ్డుకట్ట పడటం లేదు. ఉపాధికోసం మహిళలుసైతం కువైట్ వెళ్తుంటారు. ఏజెంట్ల ద్వారా ఆ దేశానికి వెళ్లి అక్కడ పనులు చేసుకుంటుంటారు. ఈ తరహాలోనే తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం బొడేవాoడ్ల పల్లెకు చెందిన శ్రావణికి కువైట్ వెళ్లింది. ఏజెంట్ చెంగల్ రాజా ద్వారా ఈనెల 24న పనికోసం కువైట్ కు వెళ్లిన శ్రావణి అక్కడ నరకం చూస్తుంది. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వివరించింది. ఏజెంట్ చెంగల్ రాజా, అతని పార్టనర్ మదనపల్లె కు చెందిన బావాజీ తనను గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వాపోయింది.

Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త

ఈనెల 24న ఏజెంట్ సహాయంతో శ్రావణి కువైట్ వెళ్లింది. వెళ్లిన దగ్గర నుంచి ఏజెంట్ చెంగల్ రాజు నరకం చూపిస్తున్నాడంటూ శ్రావణి వాపోయింది. కోరిక తీర్చాలంటూ ఏజెంట్, ఆయన పార్టనర్ చిత్రహింసలకు గురిచేస్తున్నారని కన్నీరుమున్నీరయింది. గదిలో నిర్భందించారని, నాలుగు రోజులుగా గదిలోనే ఉంచారని, కనీసం తిండి, నీళ్లు లేక తిప్పలు పడుతున్నానని తెలిపింది. ఇండియాకు పంపించమని అడిగినా వారు తనను పట్టించుకోవటం లేదని కన్నీటి పర్యంతం అవుతూ బాధితురాలు శ్రావణి తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియోలో పేర్కొంది. శ్రావణి పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులకు కన్నీరుమున్నీరవుతున్నారు.