West Godavari : పందెం కోళ్ల అరెస్ట్..పది రోజులుగా జైల్లోనే…

పది రోజులుగా కోడిపుంజులు ఉండి పీఎస్ లో జైలు జీవితాన్ని గడుపుతున్నాయి. కోళ్లను విడిపించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు...

West Godavari : పందెం కోళ్ల అరెస్ట్..పది రోజులుగా జైల్లోనే…

Undi Ps

Updated On : December 29, 2021 / 8:20 PM IST

Kolla Pandalu : పోలీస్ స్టేషన్ లో ఎవరుంటారు ? నేరం చేసిన వాళ్లుంటారు అంటారు కదా. కానీ…పీఎస్ లో పందెం కోళ్లకు పోలీసులు పహారాగా ఉంటూ..వాటికి కావాల్సిన తిండి, నీళ్లు పెడుతున్నారు. గత పది రోజులుగా వాటిని స్టేషన్ లో బంధించారు. ఇవి తమ కోళ్లు అంటూ..ఎవరు ముందుకు రావడం లేదు. అసలు కోళ్లు చేసిన నేరం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? అవేం నేరం చేయలేదు. నేరం విషయంలో తమకు ప్రమేయం లేకుండానే..అవి జైలు జీవితం గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే…

Read More : Vi Prepaid Packs : వొడాఫోన్‌ ఐడియా 3 OTT ప్రీపెయిడ్ ప్యాక్స్ ఎత్తేసింది.. వెంటనే చెక్ చేసుకోండి!

కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఈ పండుగ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కోళ్ల పందేలు. ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కోళ్ల పందేలను నిర్వహిస్తుంటారు. పందేలను నిర్వహించకూడదని పోలీసులు చెప్పినా..డోంట్ కేర్ అంటుంటారు నిర్వాహకులు. ఇలాగే…పశ్చిమ గోదావరి జిల్లాలో పందేం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి నుంచే పందేలను నిర్వహిస్తున్నారు. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ యదేచ్ఛగా కోళ్ల పందాలను నిర్వహిస్తున్నారు. వేలల్లో బెట్టింగులకు పాల్పడుతున్నారు.

Read More : New Year Resolution: కొత్త సంవత్సరంలో మందు మానేద్దామనుకుంటున్నారా?

పాములపర్రు, కలుగొట్ల గ్రామాల్లోని కోళ్ల పందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పలువురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారితో పాటు 9 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పది రోజులుగా కోడిపుంజులు ఉండి పీఎస్ లో జైలు జీవితాన్ని గడుపుతున్నాయి. కోళ్లను విడిపించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మామూలుగా అయితే పందెం కోళ్ల ఓనర్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫైన్‌ కట్టి వాటిని తీసుకెళ్తారు. అయితే ఈ పందెం కోళ్లను తీసుకెళ్లడానికి ఎవరూ రావడం లేదు. దీంతో పోలీసులే వాటి పోషణను చూసుకుంటున్నారు.