చంద్రబాబు నాయుడి ఇంటివద్ద భారీగా భద్రత.. ఎందుకో తెలుసా?

చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది అధికారులు..

చంద్రబాబు నాయుడి ఇంటివద్ద భారీగా భద్రత.. ఎందుకో తెలుసా?

Chandrababu Naidu

Updated On : June 6, 2024 / 11:37 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దీంతో చంద్రబాబు ఇంటివద్ద భద్రతను భారీగా పెంచారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ జరుగుతోంది. చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది అధికారులు అక్కడ అంతా హడావిడి వాతావరణం నెలకొననుంది. దీంతో నిన్నటి కంటే ఇవాళ భద్రతను మరింత పెంచారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన సామగ్రిని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి నిన్న లారీల్లో తరలించారు. ఈ నెల 12న ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తీసుకొచ్చిన టెంట్లను, ఇతర సామగ్రిని రాయపూడి సీడాక్సెస్ వద్ద ఉంచారు. చంద్రబాబు ఏ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరవుతే ఉద్దంద్రాయుని పాలెంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయనుంది అధికార యంత్రాంగం. మోదీ రాకపోతే రాయపూడి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా, 2019లో 151 సీట్లు గెలిచి అసలు అన్ని సీట్లు గెలవడం ఎవరికైనా సాధ్యమేనా అని ఆశ్చర్యం కలిగించేలా చేశారు జగన్.

కానీ, 151 కాదు.. అంతకుమించిన ఫలితాలు సాధ్యమేనని చంద్రబాబు అండ్‌ టీమ్ నిరూపించింది. రాష్ట్రంలో అధికారం మారడం, టీడీపీకి భారీ మెజారిటీ రావడంతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.

Also Read: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ దేశాల అధినేతలకు ఆహ్వానం