మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ దేశాల అధినేతలకు ఆహ్వానం

Narendra Modi: అప్పట్లో ఈ కార్యక్రమానికి వీవీఐపీలు సహా 8,000 మంది అతిథులు హాజరయ్యారు.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ దేశాల అధినేతలకు ఆహ్వానం

PM Narendra Modi

Updated On : June 6, 2024 / 10:25 AM IST

ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఆహ్వానం అందింది.

అలాగే, మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అధినేతలను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్‌టెక్ (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్) దేశాల అధినేతలను ఎన్డీఏ ఆహ్వానించింది.

అప్పట్లో ఈ కార్యక్రమానికి వీవీఐపీలు సహా 8,000 మంది అతిథులు హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్డీఏ ఏర్పాట్లు చేసుకుంటోంది.

బీజేపీకి ఒంటరిగా పూర్తి మెజారిటీ దక్కకపోవడంతో ఈ సారి ఎన్డీఏలోని ఇతర పార్టీలకు కేంద్ర మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీకి వచ్చే కేంద్ర మంత్రి పదవులపై ఆసక్తి నెలకొంది.

 

Also Read: ఎమ్మెల్యేగా నా జీతం మొత్తం తీసుకుంటాను.. ఎందుకంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..