Amaravati : అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల కార్లను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయన అనుచరులను..

Amaravati : అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల కార్లను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

High Tension in Amaravathi

Updated On : September 10, 2024 / 1:55 PM IST

Amaravati : పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయన అనుచరులను రావడానికి వీళ్లేదని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పెద్దకూరపాడు మండలంలో కొన్ని ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శంకర్ రావు తన అనుచరులతో కలిసి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో 14వ మైలురాయి వద్ద టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది.

Also Read : Rahul Gandhi : రిజర్వేషన్ల రద్దు అంశం.. ఎన్నికల సంఘంపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

శంకర్ రావు, ఆయన అనుచరుల కార్లపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కొందరు టీడీపీ కార్యకర్తలు కార్లపైకి దూసుకెళ్లి దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టీడీపీ నేతలను వెనక్కు పంపించారు. టీడీపీ నేతల తీరుపై నంబూరి శంకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అంటూ ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం అని శంకర్ రావు అన్నారు.