ఆంధ్ర తీరంలో బెలీన్ తిమింగళాలు.. రక్షించుకోకపోతే ఎలా?

  • Published By: sreehari ,Published On : February 22, 2020 / 06:50 PM IST
ఆంధ్ర తీరంలో బెలీన్ తిమింగళాలు.. రక్షించుకోకపోతే ఎలా?

Updated On : February 22, 2020 / 6:50 PM IST

ఇప్పుడు ఈ తిమింగిలాలకు మన తీరప్రాంతాలే ఆవాసాలు. తమ జీవనానికి సురక్షితమైన అవాసాలను ఏపీలోని రెండు ప్రధాన తీర ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. నెలల తరబడి ఇక్కడే ఉండి జీవనాన్ని సాగిస్తున్నాయట. అవే.. బెలీన్ తిమింగళాలు.. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో వీటి కదిలికలు ఎక్కువుగా ఉన్నాయంటూ సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (CMFRI) జలచర జీవుల పరిశోధక బృందం గుర్తించింది.

విశాఖ సముద్ర తీరంలో రెండుచోట్ల ఆవాసలను గుర్తించగా, నెల్లూరు జిల్లా మోటుపల్లి, కాకినాడ తీర ప్రాంతాల్లో బెలీన్ తిమింగళాల ఆవాసాలు ఉన్నట్టు గుర్తించింది. దీన్నే తిమింగళాల (స్టాండింగ్‌ లొకేషన్స్‌)గా పరిశోధక బృందం వెల్లడించింది. అంతేకాదు.. ఆరేళ్లుగా మన తీరంలో అనివార్య కారణాల రీత్యా ఎన్నో తిమింగళాలు చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఇలాంటి బెలీన్ తిమింగళాల కదిలికలను గుర్తించేందుకు వీలుగా సీఎంఎఫ్‌ఆర్‌ఐ మ్యాపింగ్‌ రూపొందించింది. దేశంలోని సముద్ర జలాల్లో జీవించే జంతు జాతుల కదిలికలను ఇది గుర్తిస్తుంది. అంతేకాదు.. తూర్పు తీరాన బంగాళాఖాతంలో అరుదైన జంతు జాతుల కదలికలు ఉన్నట్లుగా ఈ మ్యాప్ గుర్తించింది. 

ఈ జలచరాల్లో ముఖ్యమైనవి బెలీన్‌ తిమింగలాలు. ఈ తిమింగళాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయని అంటున్నారు. బూడిద, నలుపు రంగుల్లో ఉండే ఈ తిమింగళాలు.. ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయని చెబుతున్నారు. 20 అడుగుల పొడవు ఉండి 3వేల కిలోల బరువుండే ఈ తిమింగలాల జీవితకాలం 70నుంచి 80 ఏళ్ల జీవిస్తాయట. సాధారణ తిమింగలాలతో ఈ బెలీన్ తిమింగళాలు కలవు. వేసవి సీజన్ సమయంలో ఈ బెలీన్ తిమింగళాలన్నీ మంచు ప్రాంతాలకు వలస వెళ్తాయి. శీతాకాలంలో ఉష్ణ మండల జలాల్లోకి వలసపోతుంటాయి. రెండు నుంచి మూడు నెలల పాటు ఒకే ప్రాంత జలాల్లో సంచరిస్తు జీవనం సాగిస్తుంటాయి. రోజుల తరబడి ఉన్నచోటే కదలకుండా సంచరిస్తుంటాయి. 

జలచరాల ఆవాసాలను గుర్తించేందుకు శాటిలైట్‌ ఆధారిత జీపీఎస్‌ కో–ఆర్డినేట్స్‌ ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలను వినియోగిస్తారు. అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం వీటిపై లోతుగా అధ్యయనం చేస్తారు. ఈ విధంగా గుర్తించిన ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసి వాటి స్టాండింగ్‌ లొకేషన్స్‌ను ప్రకటిస్తారు. తిమింగలం జాతుల స్ట్రాండింగ్‌ లొకేషన్స్‌ ప్రకటించడం ద్వారా వాటి పరిరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏపీ తీరంలో 2013 నుంచి తిమింగల జాతుల మృత్యువాత పడినట్టు డేటా నమోదు అవుతూనే ఉన్నాయి.