గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం… మంటల్లో కాలిపోయిన సెల్ ఫోన్ షాప్

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 11:42 AM IST
గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం… మంటల్లో కాలిపోయిన సెల్ ఫోన్ షాప్

Updated On : November 21, 2020 / 12:31 PM IST

Huge fire accident : గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేపలమార్కెట్ లోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఓ సెల్ ఫోన్ షాప్ కాలి బూడిదైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే దాదాపుగా రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు.



https://10tv.in/huge-competition-for-mlc-ticket-in-bjp/
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలోని సెన్ ఫోన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సెల్ ఫోన్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే పొద్దున పూట రద్దీగా ఉండే చేపల మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ప్రజలు షాక్ గురయ్యారు.



చుట్టుపక్కల ఉన్న షాపులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనలో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.