Payyavula Keshav : సోలార్ పవర్ కొనుగోళ్లలో భారీ అవినీతి.. పీఏసీ చైర్మన్ సంచలన ఆరోపణలు

ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన

Payyavula Keshav : సోలార్ పవర్ కొనుగోళ్లలో భారీ అవినీతి.. పీఏసీ చైర్మన్ సంచలన ఆరోపణలు

Payyavula Keshav

Updated On : November 5, 2021 / 4:38 PM IST

Payyavula Keshav : ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన సోలార్ విద్యుత్ ధరల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఇతర రాష్ట్రాలు యూనిట్ రూ.1.99 కే కొనుగోలు చేస్తే, ఏపీలో మాత్రం రూ.2.49కి కొన్నారని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.30 వేల కోట్ల మేర లావాదేవీలకు గంటల్లోనే ప్రతిపాదనలు, ఆమోదాలు తెలపడం వెనుకున్న మతలబు ఏంటని ప్రశ్నించారు.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొన్నామని ప్రచారం చేస్తున్నారని పయ్యావుల తెలిపారు. గత నవంబర్ లో పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.2కే సౌర విద్యుత్ ఇచ్చారని పయ్యావుల కేశవ్ వివరించారు. గుజరాత్ రూ.1.99కే కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రూ.2.49 ధర ఎలా చౌక అవుతుందని నిలదీశారు. ఈ లెక్కన సెకీ నుంచి డిస్కంలకు చేరేసరికి యూనిట్ ధర రూ.4.50 దాటినా ఆశ్చర్యం అక్కర్లేదని అన్నారు.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

దీని వెనుక భారీ అవినీతి దాగి ఉందని, ఈ సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారం స్కీమ్ కాదని, అదానీ కోసం చేసిన స్కామ్ అని విమర్శించారు. అదానీకి ఇక్కడ దక్కని టెండర్లను సెకీ రూపంలో కట్టబెట్టారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ఏమైంది? జ్యుడిషియల్ ప్రివ్యూ ఏమైంది? అని పయ్యావుల ప్రశ్నించారు. ఏపీకి 10 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉన్నా, పక్క రాష్ట్రాలకు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని పయ్యావుల అడిగారు.