father daughter suicide : భార్య అనారోగ్యానికి గురైందని కుమార్తెతోపాటు భర్త బలవన్మరణం…

విజయవాడలోని శ్రీనర్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో పదేళ్ల కుమార్తెతో కలిసి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

father daughter suicide : భార్య అనారోగ్యానికి గురైందని కుమార్తెతోపాటు భర్త బలవన్మరణం…

Father Daughter Suicide

Updated On : April 10, 2021 / 7:44 PM IST

father suicide along with daughter : విజయవాడలోని శ్రీనర్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో పదేళ్ల కుమార్తెతో కలిసి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్యకి ఇవ్వాలని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.

జగాని రవి, భరణి భార్యభర్తలు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. గత కొంత కాలంగా భరణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రవి గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు.

అయితే, జగాని రవి మృతదేహం పలు అనుమానాలకు కారణమవుతోంది. ఉరి వేసుకున్న వ్యక్తి కాళ్లు, చేతులు, ముఖం కప్పేసి ఉండటమే అందుకు కారణం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.