కరోనా నియంత్రణకు రూ.2కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 04:23 AM IST
కరోనా నియంత్రణకు రూ.2కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

Updated On : March 26, 2020 / 4:23 AM IST

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా కష్టం అంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్.. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా దేశంలోనూ విస్తరిస్తుండగా.. కరోనా నియంత్రణకు, కరోనాను కట్టడి చెయ్యడానికి ప్రభుత్వానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్.

రెండు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు రూ. 50లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 50లక్షలు.. మొత్తం కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. అలాగే ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరోనా కారణంగా లాక్‌డౌన్ ఉన్న సమయంలో వారిని ఆదుకునేందుకు తన వంతు సహాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అలాగే కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు స్థంభించిపోగా.. ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు కూడా రూ. కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.