తెలుగు రాష్ట్రాల్లో కరోనా ‘కొవాగ్జిన్’ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసింది. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రికి ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ICMR పర్మిషన్ ఇచ్చేసింది. అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించిన అనుభవం ఉండటంతో నిమ్స్, కేజీహెచ్‌కు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. కరోనా చికిత్సకు సంబంధించి ఆగస్టు 15వ తేదీన కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ రాబోతోంది.
భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో టీకా రాబోతుంది. దీనిపై త్వరితగతిన పరిశోధనలు కూడా జరగాల్సి ఉంది. క్లినికల్ ట్రయల్స్ కూడా జరగాలి. ఇది మనుషులపై ప్రయోగించి సక్సెస్ అయితే మాత్రం ఆగస్టు 15 నుంచి కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 12 సెంటర్లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిమ్స్, ఏపీలో విశాఖ కేజీహెచ్ లో అనుమతులు ఇచ్చింది. కేజీహెచ్ ఆస్పత్రిలో వాసుదేవా అనే వైద్యున్ని నోడల్ ఆఫీసర్ గా నియమించగా, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో నోడల్ ఆఫీసర్‌గా వైద్యుడు ప్రభాకర్ రెడ్డిని నియమించడం జరిగింది.
అనుకున్న సమయంలో క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా విజయవంతమై.. వచ్చే నెల 15లోగా ఈ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
Read:కరోనా వ్యాక్సిన్ కు అడుగు దూరంలో భారత్.. ప్రపంచ దేశాల చూపు మనవైపే