Yemmiganur: ఎమ్మిగనూరులో బావిలోకి దూసుకెళ్లిన కారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు

Yemmiganur
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
బావిలో పుష్కలంగా నీరు ఉండటంతో కారును గుర్తించడం కాస్త సమస్యగా మారింది. కనిపించకుండాపోయిన కారు కోసం గజ ఈతగాళ్లు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు బీభత్సం.. ఆరుగురు మృతి