శుభవార్త.. ఇక మరింత వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

ఇందిరమ్మ పథకంతో పాటు జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో టవర్ల విధానంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కూడా ఈ నిధులను వాడతారని సమాచారం.

శుభవార్త.. ఇక మరింత వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

Indiramma Housing Scheme

Updated On : December 16, 2025 / 12:11 PM IST

Indiramma Housing Scheme: తెలంగాణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కొరత రాకుండా సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఆ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరగనుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి తెలంగాణ సర్కారు ఇటీవల రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకుంది.

Also Read: లక్కీ ఛాన్స్‌.. బంగారం ధర తగ్గేసింది.. మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

హౌసింగ్ స్కీమ్ కింద రాష్ట్రాలకు హడ్కో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుందన్న విషయం తెలిసిందే. క్యాబినెట్ ఆమోదం అనంతరం ఈ నిధులు లబ్ధిదారులకు రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఇందిరమ్మ పథకంతో పాటు జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో టవర్ల విధానంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కూడా ఈ నిధులను వాడతారని సమాచారం. (Indiramma Housing Scheme)

తెలంగాణలో ప్రస్తుతం 1,48,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో దాదాపు 60,000 ఇళ్ల స్లాబ్ వర్క్ పూర్తయింది. మార్చి ముగిసేలోగా లక్ష ఇళ్లు పూర్తి చేయనున్నారు.

లబ్ధిదారుల ఇంటి స్టేటస్‌ బట్టి ప్రతి సోమవారం వారికి గ్రీన్ చానెల్ ద్వారా దశల వారీగా వారి అకౌంట్లకు నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా మొత్తం రూ.3,500 కోట్లు వేశారు. మార్చి 31లోగా లక్ష ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.