Tirumala Fake Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. హైకోర్టులో చిన్న అప్పన్నకు ఎదురుదెబ్బ
నెయ్యి సరఫరాదారుల నుంచి భారీగా కమిషన్ తీసుకున్నారన్న ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Tirumala Fake Ghee Case: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ(పర్సనల్ అసిస్టెంట్) చిన్న అప్పన్నకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిన్న అప్పన్న. అయితే, చిన్న అప్పన్నకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాదారుల నుంచి భారీగా కమిషన్ తీసుకున్నారన్న ఆరోపణలపై వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చిన్న అప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విని గతంలో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సప్లయ్ చేసిన డెయిరీల నుంచి చిన్న అప్పన్న కేజీకి 25 రూపాయల చొప్పున కమీషన్ తీసుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. చిన్న అప్పన్నకు కమీషన్ ఇచ్చినట్లు నెయ్యి సరఫరాదారులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఎవరి ప్రోద్బలంతో చిన్న అప్పన్న డెయిరీల నుంచి కమీషన్ వసూలు చేశారో దర్యాఫ్తులో తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు డబ్బు చేరిందన్నారు. రూ కోట్లలో లావాదేవీలు జరిగినట్లు దర్యాఫ్తులో తేలిందన్నారు.
Also Read: టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక.. ఏ క్షణమైనా ప్రకటన..!? లీకులు ఏం చెబుతున్నాయంటే?
