Cm Chandrababu: పీపీపీపై వైసీపీ అనవసర రాజకీయం చేస్తోంది.. 3 రాజధానుల విధానం మహాకుట్ర- సీఎం చంద్రబాబు

ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

Cm Chandrababu: పీపీపీపై వైసీపీ అనవసర రాజకీయం చేస్తోంది.. 3 రాజధానుల విధానం మహాకుట్ర- సీఎం చంద్రబాబు

Updated On : December 15, 2025 / 10:44 PM IST

Cm Chandrababu: వైసీపీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పీపీపీ విషయంలో వైసీపీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విషయంలో వైసీపీ అనవసరమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సంపద సృష్టించటానికి ఏకైక విధానం పీపీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తి అని గుర్తించాలని హితవు పలికారు.

పీపీపీ మెరుగైన విధానం అని కేంద్రం కూడా స్పష్టం చేసిందని చంద్రబాబు తెలిపారు. భావి తరాల కోసం సంపద సృష్టించి ఆదాయం పెంచేందుకే పీపీపీ పద్ధతిలో వివిధ ప్రాజెక్టులు తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన 3 రాజధానుల విధానం మహాకుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి తెచ్చి అపహాస్యం చేశారని గత జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

Also Read: టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక.. ఏ క్షణమైనా ప్రకటన..!? లీకులు ఏం చెబుతున్నాయంటే?