రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ : సీఎం జగన్

రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురించి మంత్రి వెల్లడించారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిందిగా..స్పీకర్ కోరారు.
2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మంత్రి బుగ్గన.. వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టగా.. మరో మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ రద్దు బిల్లుని ప్రవేశపెట్టారు. దీనిపై సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది.
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారనే వివరాలను మంత్రి బుగ్గన ఆధారాలతో సహా బయట పెట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని స్వయంగా సీఎం జగన్ ను కోరారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ…స్పీకర్ నుంచి వచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూస్తామని ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తామన్నారు. వాస్తవాలు ఏంటో ప్రపంచానికి తెలియాలని వైసీపీ కోరింది. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read More : బడ్జెట్ 2020 – 21 : నార్త్ బ్లాక్‌లో హల్వా ఘుమఘుమలు