Pawan Kalyan: పవన్ కల్యాణ్ కన్ఫూజన్‌లో ఉన్నారా?
ఏపీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న పవన్.. బాబు, బీజేపీని దగ్గరకు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, చంద్రబాబు అరెస్టు తర్వాత..

Is pawan kalyan cufusion on BJP, TDP Alliance
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ కన్ఫూజన్‌లో ఉన్నారా? టీడీపీ, బీజేపీ అనే రెండు పడవలపై ప్రయాణిస్తున్నారా? ఈ రెండు పార్టీలను దగ్గర చేయాలని చూసిన పవన్ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించిన పవన్.. బీజేపీతో (BJP) కలిసి ఇప్పుడు ఏం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాబుకు బాసటగా నిలుస్తానని ఇప్పటికే ప్రకటించారు పవన్.. ఐతే చంద్రబాబు అరెస్టుపై (Chandrababu Arrest) బీజేపీకి ముందే సమాచారం ఉందన్న కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆరోపణలు పవన్ ఏ విధంగా తీసుకుంటారు? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?
ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ పాత్ర కీలకంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆగమేఘాలపై స్పందించిన పవన్.. విపక్ష నేతకు సంఘీభావం ప్రకటించడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ రోడ్డెక్కారు. టీడీపీ నేతలకన్నా ఓ అడుగు ముందుకేసి అధికార పార్టీపై విమర్శల దాడి చేశారు. ఫ్లైట్ అడ్డుకుంటే కారు.. కారు అడ్డుకుంటే రోడ్డంటూ విజయవాడ (Vijayawada) వచ్చేవరకు హల్‌చల్ చేశారు పవన్.. టీడీపీ ప్రకటించిన రాష్ట్ర బంద్‌కు మద్దతు తెలిపారు. కానీ, పవన్‌తో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం రాష్ట్రబంద్‌కు మద్దతు ప్రకటించలేదు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై కేంద్ర ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కాకరేపాయి. ప్రస్తుతం పవన్, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ సమావేశానికి కూడా వెళ్లారు పవన్.. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు. కాని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల విమర్శలను పరిశీలిస్తే… టీడీపీ, బీజేపీ మధ్య మైత్రి కుదురుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: చంద్రబాబు తర్వాత జైలుకెళ్లేది అతడే? ఇది శాంపిల్ మాత్రమే, మమతా బెనర్జీ చెప్పింది అదే
ఏపీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న పవన్.. బాబు, బీజేపీని దగ్గరకు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఒక విధంగా జనసేనానికి విషమ పరీక్షగా చెబుతున్నారు. బాబు, బీజేపీని దగ్గరకు చేసేందుకు పవన్ ఏం చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారనేది హాట్‌టాపిక్ అవుతోంది.