Akkineni Nagarjuna: మా సమస్యల పరిష్కారం కోసమే సీఎం దగ్గరకు చిరంజీవి -నాగార్జున
మరికాసేపట్లో సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి సమావేశం.. నాగార్జున స్పందన!

Nagarjuna
Akkineni Nagarjuna: టాలీవుడ్ టికెట్ వార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టిక్కెట్ల విషయంలో కొన్ని నెలల నుంచి అసంతృప్తిగా ఉన్న ఇండస్ట్రీలో కొత్త ఆశలు రేకెత్తాయి. టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా సాగిన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుందని భావిస్తున్నారు. మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు.
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్న చిరంజీవి.. టాలీవుడ్‌లో సమస్యల గురించి చర్చించనున్నారు. వీరు ఏ అంశాలపై చర్చిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టికెట్ల రేట్లు తగ్గించడం అనేది ప్రధాన అంశం కాగా.. ఈ విషయంపై చర్చించడానికి ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
చిరంజీవి జగన్‌ని కలుస్తుండడంపై సీనియర్ హీరో నాగార్జున స్పందించారు. మా అందరి కోసమే చిరంజీవి జగన్‌తో భేటి అవుతున్నారని చెప్పారు నాగార్జున. ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకుని వెళ్తారని చెప్పారు నాగార్జున. బంగార్రాజు సినిమా విడుదల ఉండటం వల్లే చిరంజీవితో కలిసి జగన్ దగ్గరకు వెళ్లలేకపోయినట్లు చెప్పారు నాగార్జున.