పాలన రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్!

మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినట్లు చేసేస్తోంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సభ ఆమోదం పొందింది. ఇక అందరి చూపు విశాఖపట్టణం వైపు నెలకొంది. పాలనా రాజధాని విశాఖకు ఎప్పుడు వెళుతుందనేది ఏపీ ప్రజలను మెదలుతున్న ప్రశ్న.
ఇప్పటికే తరలించాడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తెలుగు కొత్త సంవత్సరాది..అంటే..ఉగాది..పండుగ తర్వాత విశాఖలో పాలన ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 04వ తేదీ మంచి ముహూర్తమని, అప్పుడే పాలన ప్రారంభిస్తే..ఎలాంటి సమస్యలు ఉండవని పలువురు చెబుతున్నారంట. బడ్జెట్ సమావేశాలు అమరావతిలో కొనసాగించిన అనంతరం ఏప్రిల్ నాటికి పూర్తి పాలన విశాఖ నుంచే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
విశాఖకు వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం పలు వరాలు కురిపించేందుకు రెడీ అయిపోయింది. ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలపై చర్చ, ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలను కమిటీ ఉంచనుంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే..అక్కడకు వెళ్లేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ వెల్లడించింది. మరోవైపు ఈ విషయం సచివాలయ ఉద్యోగులకు ముందుగానే తెలుసనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందులో భాగంగా..వీరంతా..విశాఖకు వెళ్లేందుకు రెడీ అయిపోయారనే చర్చ జరుగుతోంది.
అద్దె ఇళ్లకు ఎక్కడ అనుకూలం ఉంటుంది ? సొంత ఇళ్లు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పటికే వెతుకలాట పనులు ప్రారంభించారని సమాచారం. దీంతో కొన్ని ప్రాంతాలకు యమ డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. విశాఖ నగరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఫుల్ గిరాకీ ఉందంట. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా ఏప్రిల్ 04వ తేదీ తర్వాత తరిలిస్తారా ? లేదా ? అనేది చూడాలి.
Read More : ఏపీ శాసనమండలి చరిత్ర : 16 ఏళ్ల తర్వాత..