రంగంపేటలో జల్లికట్టు : మోహన్ బాబు, మంచు మనోజ్ స్పెషల్ అట్రాక్షన్

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 07:46 AM IST
రంగంపేటలో జల్లికట్టు : మోహన్ బాబు, మంచు మనోజ్ స్పెషల్ అట్రాక్షన్

Updated On : January 16, 2020 / 7:46 AM IST

చిత్తూరు జిల్లాలో రంగంపేటలో జల్లికట్టు వేడుకలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజు 2020, జనవరి 16వ తేదీ గురువారం ఉదయం వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ క్రీడను యదావిధిగా సాగిస్తామని, ఎలాంటి నిబంధనలు లేవంటున్నారు నిర్వాహకులు. మరోవైపు రంగంపేట వద్ద పోలీసులు పెద్దగా కనిపించడం లేదు. 

కోడెద్దులు  రంకెలు వేస్తూ ముందుకు దూసుకొచ్చాయి. జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు జరుగుతున్నా…రంగంపేటకి మాత్రం జనాలు భారీగా పోటెత్తారు. దీనిపై నిషేధం ఉన్నా…పోలీసులు ఎవరూ లేకపోవడం విశేషం. తమిళనాడులో జరిగే జల్లికట్టుకు..ఇక్కడ జరిగే..పోటీలకు చాలా తేడా ఉంది. పలకలు, టవల్స్ బిగిస్తుంటారు. వీటిని చేజిక్కించుకొనేందుకు యువకులు పోటీ పడుతుంటారు. పరుగులు తీస్తున్న ఎద్దులను అడ్డుకొనే సమయంలో పలువురికి గాయాలవుతుంటాయి. ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. 

మరోవైపు జల్లికట్టు వేడుకలు చూసేందుకు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్‌లు హాజరయ్యారు. వీరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. 

Read More : జల్లికట్టులో విషాదం..మహిళ మృతి