ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 05:59 AM IST
ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!

Updated On : January 16, 2020 / 5:59 AM IST

ఏపీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు విజయవాడకు చేరుకున్నారు. 2020, జనవరి 16వ తేదీ గురువారం హోటల్ మురళీ ఫార్చ్యూన్‌లో భేటీ అయ్యారు.

బీజేపీ నుంచి సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, పురంధేశ్వరీ, సోము వీర్రాజు హాజరు కాగా..జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. అంతకుముందు భేటీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు కసరత్తు జరిపారు. రాజధాని అంశం, మహిళలపై దాడులు, పొత్తులతో సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. 

అమరావతిలో రాజధాని కొనసాగింపు అంశమే తొలి పోరాట అజెండా కానున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు కూడా… రాజధాని అమరావతి అంశంపై ఉమ్మడి పోరు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపును మాత్రం రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ అమరావతినే రాజధానిగా ఉంచాలనే తీర్మానం చేసింది. జనసేన కూడా ఒకేచోట నుంచి పాలన అభివృద్ధి వికేంద్రీకరణ అని తీర్మానించింది. దీంతో రెండు పార్టీల పొత్తుపై సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.  

* ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజకీయం
* బీజేపీ నేతలతో పవన్ కీలక సమావేశం 
* రాజధాని సహా కీలక అంశాలపై చర్చించనున్న నేతలు
 

* బీజేపీ-జనసేన పొత్తుపై ఇవాళ్టి భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం
* భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఇరు పార్టీల కసరత్తు
* విడివిడిగా పార్టీ నేతలతో బీజేపీ-జనసేన సమావేశం.