Pawan Kalyan : మీరు ఇలా చేసుకుంటూ పోతే .. మేం ఇడుపులపాయలో హైవే వేస్తాం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులన పరామర్శించటానికి ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో పవన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతూ..’ రోడ్డు విస్తరించటానికి ఇదేమన్నా కాకినాడ, రాజమండ్రిలాంటి టౌన్ ప్రాంతమా? రోడ్డపై గుంతలు పూడ్చలేరుగానీ రోడ్లు విస్తరిస్తారా?సామాన్యుల ఇళ్లు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేస్తారా?‘మేం ఇడుపుల పాయలో హైవే వేస్తాం’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Pawan Kalyan : మీరు ఇలా చేసుకుంటూ పోతే .. మేం ఇడుపులపాయలో హైవే వేస్తాం

Pawan Kalyan visit to Guntur district Ippatam

Updated On : November 5, 2022 / 10:49 AM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో శనివారం (నంవంబర్ 5,2022)పర్యటిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులన పరామర్శించటానికి ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ పర్యటనను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో పవన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతూ..’ రోడ్డు విస్తరించటానికి ఇదేమన్నా కాకినాడ, రాజమండ్రిలాంటి టౌన్ ప్రాంతమా? రోడ్డపై గుంతలు పూడ్చలేరుగానీ రోడ్లు విస్తరిస్తారా?సామాన్యుల ఇళ్లు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేస్తారా?‘మేం ఇడుపుల పాయలో హైవే వేస్తాం’ అంటూ పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేనాని పవన్ కల్యాణ్. రోడ్డు విస్తరణ పేరుతో ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ విగ్రహాలను కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ఏం మాట్లాడదామన్నా అడ్డుకుంటారు. అడుగు ముందుకేస్తుంటే చేతులు అడ్డంపెడతారు…ముందుకెళ్లనివ్వరు అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతారు? ఇదే పోలీసులు చేసేది? ఇదేనా పాలన అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఇలా మమ్మల్ని ఎక్కడ తిరగనివ్వకుండా ప్రభుత్వం ఇటువంటి అవరోధాలు కలిగిస్తుంటే  భయపడతామనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.

ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. తన వాహనం దిగి రోడ్డుమీద నడుస్తుంగా జనం భారీ సంఖ్యలో వచ్చి జాయిన్ అయ్యారు.పవన్ తో కలిసి నడిచారు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది అని భావించిన పవన్ తిరిగి తన వాహనంలోకి ఎక్కి ప్రయాణించారు. ఇలా పరిస్థితిలను అర్థం చేసుకుంటూ ఎవ్వరికి ఇబ్బంది కలుగకూడదనే యోచనతో పవన్ తన పర్యటనను కొనసాగిస్తుంటే పోలీసులు మాత్రం ఆయనను అడ్డుకోవటం మానలేదు.

ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవటానికి ఏవేవో సాకులు చెబుతున్నారు. పోలీసులు ఎక్కడిక్కడ పవన్ ను అడ్డుకోవటానికి చేతులు అడ్డంగా పెట్టినా…జనసేనాని మాత్రం ఏమాత్రం సమన్వయం కోల్పోకుండా మేం కేవలం పర్యటనకు వచ్చాం..బాధితులన పరామర్శించటానికి వారి కష్టసుఖాలు తెలుసుకోవటానికి వచ్చాం అంతేతప్పా ఏదో శాంతిభద్రతలకు విఘాతం కల్పించటానికి వచ్చినట్లుగా మీరు మమ్మల్ని ఇలా అడ్డుకోవటం సరికాదు అని పోలీసులకు నచ్చచెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయినా పవన్ ను పోలీసులు పదే పదే అడ్డుకుంటూ అసహనం కలిగిస్తున్నారు. రోడ్డు విస్తరించే పనులు జరుగుతున్నాయి మీరు ఇలా వెళ్లటం కుదరదు అంటూ పవన్ తో వాగ్వాదానికి దిగారు పోలీసులు. ఇలా పవన్ కు పోలీసులకు మధ్యా వాగ్వాదం చోటుచేసుకోవటంతో పరిస్థితి ఎలా మారుతుందా? అన్నట్లుగా ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

జనసేన ప్లీనరీ సమావేశానికి ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు గ్రామంలో 120 అడుగుల రోడ్‌ నిర్మిస్తామంటూ దారిలో ఉన్న ఇళ్లననింటినీ కూల్చేస్తున్నారు. జనసేన వర్గీయులు అన్న కారణంగానే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఇప్పటం గ్రామస్తులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ప్రభుత్వానికి భయపడకుండా ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్.. గ్రామానికి యాభై లక్షల విరాళం ఇచ్చారు. దాంతో వారు ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించారు.

అయితే దానికి బలవంతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీనిపై మూడు రోజుల కిందట.. ఆ గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అప్పుడు కరెంట్ నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటం ఇళ్ల తొలగింపు అంశంపై పవన్ కల్యాణ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని పవన్ మండిపడ్డారు. బాధితులకు అండగా నిలబడాలని .. ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకుని ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ప్రతీచోటా పవన్ ను అడ్డుకోవానికి యత్నిస్తున్నారు.