Pawan Kalyan: ఇక దూకుడే..! వైసీపీపై పోరులో వేగం పెంచిన పవన్.. నేడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న జనసేనాని
విశాఖపట్టణం ఘటన నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వెళ్లేందుకు పవన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో వైసీపీపై పోరులో వేగం పెంచారు. ఈ మేరకు మంగళవారం తదుపరి కార్యాచరణను సిద్ధంచేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడనున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. విశాఖపట్టణం వేదికగా వైసీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. మంత్రులపై దాడిచేశారంటూ విశాఖపట్నంలో జనసేన నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు కేసులు నమోదుచేసిన వారిలో కొందరికి స్టేషన్ బెయిల్ రాగా.. కొందరిని రిమాండ్‌కు పంపించారు. విశాఖపట్టణంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికే పవన్ తెలిపారు.
Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్
తాజా ఘటనతో.. అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వెళ్లేందుకు పవన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో వైసీపీపై పోరులో వేగం పెంచారు. ఈ మేరకు మంగళవారం తదుపరి కార్యాచరణపై ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడనున్నారు. వైసీపీ నేతల విమర్శలు రోజురోజుకు శృతిమించుతున్నాయని, హద్దులుదాటి మాట్లాడుతున్నారంటూ ఇప్పటికే పవన్ పలుమార్లు పేర్కొన్నారు. తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, చంద్రబాబు కనుసన్నల్లో జనసేన నడుస్తోందని వైసిపీ చేస్తున్న ఆరోపణపై పవన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
విశాఖలో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులు కొట్టివేయాలని కోరుతూ సోమవారం హైకోర్టులో జనసేన నాయకులు పిటీషన్ దాఖలు చేసిన విషయం విధితమే. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని పిటీషన్ లో పిటీషనర్ పేర్కొన్నారు. మంగళవారం పిటీషన్ పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. కేసులపై జనసేన పార్టీ న్యాయవాదులతో సోమవారం పవన్ చర్చించారు. నేడుకూడా న్యాయవాదులతో పవన్ మరోసారి చర్చించనున్నారు. అధికార పార్టీతీరుపై గతకొంతకాలంగా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విశాఖపట్టణం వేదికగా జరిగిన వివాదం నేపథ్యంలో వైసీపీపై దూకుడుగా వెళ్లేందుకు నిర్ణయించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.