ఎడ్ల పందాల్లో పాల్గొన్న కొడాలి నాని..జనసేన ఎమ్మెల్యే..సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 11, 2020 / 11:27 AM IST
ఎడ్ల పందాల్లో పాల్గొన్న కొడాలి నాని..జనసేన ఎమ్మెల్యే..సంచలన వ్యాఖ్యలు

Updated On : January 11, 2020 / 11:27 AM IST

మూడు రాజధానులపై జనసేన విమర్శలు గుప్పిస్తుంటే..ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండడం, పార్టీకి దూరంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. 2020, జనవరి 11వ తేదీ జనసేన పార్టీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన రాపాక..గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్లపందాల్లో కలిసి పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ మీటింగ్‌కు రాలేదని నేతలు చర్చించుకుంటున్నారు. రాజధానిలో జరుగుతున్న ఆందోళనలపై వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. 

రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, మంత్రి కొడాలి ఆహ్వానం మేరకు తాను ఇక్కడకు రావడం జరిగిందని వెల్లడించారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైందనని మరోసారి స్పష్టం చేశారు రాపాక. ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. 

బాబు ఉచ్చులో పడొద్దని మంత్రి కొడాలి నాని సూచించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దొంగమాటలు చెప్పిన బాబు..ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అదే పనిచేస్తున్నారని విమర్శించారు. సామాన్యులు ఎవరూ సచివాలయానికి వచ్చే పరిస్థితి ఆనాడు లేదని, టీడీపీ చేసిన తప్పులు తాము చేయబోమని తేల్చిచెప్పారు. రైతులు ఒక టీంగా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

జగన్ సర్కార్‌పై వరుసగా రాపాక ప్రశంసలు కురిపిస్తుండడం చర్చనీయాంశమైంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు, షోకాజ్ నోటీసులు జారీ చేసిటన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో ఆయన పార్టీ మారుతారని చర్చ జరిగినా..అలాంటిదేమి జరగలేదు. మూడు రాజధానుల ప్రకటనకు రాపాక జై కొట్టారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకు వరప్రసాద్ వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతోనే తాను వెళ్లలేదని ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. పార్టీలో కొనసాగుతూనే..వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలకడం వారికి ఇబ్బందిగా మారింది. అధినేత పవన్ కూడా రాపాక ఎపిసోడ్‌పై అంతగా స్పందించడం లేదు. మరి రాపాక అడుగులు ఎటువైపే చూడాలి. 

Read More : 176 మంది మృతి : పొరపాటైంది..విమానం కూల్చివేతపై ఇరాన్ ప్రకటన