రైతుల కోసం : తూర్పుగోదావరిలో జనసేనానీ టూర్..వివరాలు

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 02:42 AM IST
రైతుల కోసం : తూర్పుగోదావరిలో జనసేనానీ టూర్..వివరాలు

Updated On : December 8, 2019 / 2:42 AM IST

ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలకు రానున్నారు. ఇటీవలే ఆయన రాయలసీమలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వివరాలు జనసేన పార్టీ ట్విట్టర్‌లో వెల్లడించింది. 

* 2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 08 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. 
* లాలాచెరువు, మోరంపూడి, వేమగిరి, కడియం, కడియం సావరం, జేగురుపాడు మీదుగా వెలగతోడుకు చేరుకుంటారు. 
* రైతులతో సమావేశం కానున్నారు. ధాన్యం రైతుల కష్టాలు తెలుసుకుంటారు. 
* ఇప్పనపాడు, తాపేశ్వరం మీదుగా మండపేట చేరుకుంటారు. 
* బాబు అండ్ బాబు కన్వేన్షన్‌లో రైతులతో మీటింగ్. 
* అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశం. 
Read More : అందుకే పెంచాం : APSRTC ఛార్జీల బాదుడు
రైతుల సమస్యలను తెలుసుకొనేందుకు జిల్లాలో పవన్ పర్యటించడం జరుగుతుందని జనసేన నేతలు వెల్లడిస్తున్నారు. రైతులకు మద్దతు ధరపై చర్చిస్తారని తెలిపారు. పవన్ రాయలసీమ పర్యటన డిసెంబర్ 06వ తేదీన ముగిసింది. పర్యటనలో పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. టమాట రైతులు, ఇతరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించే పవన్..ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.