జేసీ బ్రదర్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,

బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని, ప్రభుత్వం మారడంతో రాజకీయాలతో ముడిపడిన వ్యాపారాలపై ఒక్కో దెబ్బ పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుగులేని ఆధిపత్యం చేలాయించిన జేసీ సోదరులు.. ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలు:
అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేసీ సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది వైసీపీ. ఒక్కో చిట్టా విప్పుతామంటూ ఇప్పటికే సవాల్ చేసిన వైసీపీ నేతలు.. అన్నంత పనీ చేస్తున్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను అక్రమంగా నడుపుతున్నారంటూ 85 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. నిన్నటికి నిన్న పని మనుషుల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్‌ను అక్రమంగా పొందారని ఆరోపించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. పని మనుషుల షేర్లను కూడా జేసీ కుటుంబసభ్యులు లాగేసుకున్నారన్నారు. త్రిశూల్ నుంచి ఇతర సిమెంటు ఫ్యాక్టరీలకు అక్రమంగా సుమారు 200 కోట్ల విలువైన లక్షా 30వేల మెట్రిక్ టన్నుల సున్నపురాయి విక్రయించారని ఆరోపించారు. త్రిసూల్ సిమెంట్ కంపెనీ పేరుతో లీజు తీసుకొని.. మూడేళ్లైనా అక్కడ కంపెనీ పెట్టకపోవడంతో లీజు రద్దు చేయాలని తాడిపత్రికి చెందిన కందిగోపుల మురళి కోర్టుకెళ్లారు. దీంతో లీజును కోర్టు రద్దు చేసింది.
అధికారుల సంతకాలు ఫోర్జరీ:
ఇవాళ ఫోర్జరీ సంతకాల పేరుతో కొత్త ఆరోపణలు తెరమీదకొచ్చాయి. జేసీ ట్రావెల్స్‌లో ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ట్రావెల్స్ సిబ్బంది కొందరు పోలీసులు, రవాణాశాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకొని ల్యాప్ టాప్, బయోమెట్రిక్ మెషిన్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.
యాజమాన్యం ఆదేశాలతోనే ఫోర్జరీ:
ముఖ్యంగా జేసీ ట్రావెల్స్.. తాడిపత్రి ఎస్సై సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ కార్యాలయంలో బయటపడ్డ పోలీసు అధికారుల నకిలీ సీళ్లు కలకలం రేపాయి. ఫోర్జరీ సంతకాలు చేసి.. నకిలీ పత్రాలతో బెంగళూరులో ఆరు లారీలను జేసీ ట్రావెల్స్ విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటికే జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు నాగేంద్ర, రఘు అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదంతా యాజమాన్యం చెబితేనే చేశామని నిందితులు ఒప్పుకున్నట్టు తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాత్రపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ట్రావెల్స్ ఎండీగా జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమాదేవి ఉన్నారు. మరి పోలీసులు ఈ కేసులో ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తమపై కక్ష సాధిస్తోందని జేసీ ఫ్యామిలీ కౌంటర్ ఇస్తోంది. కోర్టు ద్వారానే తేల్చుకోంటామంది.