JR NTR : వాళ్లకి ఆ హక్కు లేదు.. ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు.. జూ.ఎన్టీఆర్ తరఫున అఫీషియల్ ప్రకటన
JR NTR office Official Statement on RAW NTR organization : ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, కార్యకలాపాలు నిర్వహిస్తోన్న RAW NTR సంస్థకు ఎలాంటి అధికారం లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది.
JR NTR Official Statement on RAW NTR organization
JR NTR office Official Statement on RAW NTR organization : ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, కార్యకలాపాలు నిర్వహిస్తోన్న RAW NTR సంస్థకు ఎలాంటి అధికారం లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ సంస్థ జూ. ఎన్టీఆర్తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని.. ఆయన పేరుతో ప్రకటనలు చేయడానికి లేదంటే కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదని మంగళవారం ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ RAW NTR అనే సంస్థతో లేదంటే దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదంటే ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదంటే కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు.
ఎన్టీఆర్కు సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదంటే ఇతర కార్యకలాపాల గురించి సమాచారంను ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు, సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు, కార్యక్రమాలను అధికారికమైనవిగా, విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి చేస్తున్నట్లు జూ.ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము.
అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్, సోషల్ మీడియా వేదికలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, కార్యాలయం నుంచి అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు.
