ENG vs IND 1st ODI : రోహిత్, విరాట్ ఈజ్ బ్యాక్.. నేడే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి వన్డే.. ఇంగ్లాండ్ గడ్డపై రో-కో గణాంకాలివే..
ENG vs IND 1st ODI : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు.
Virat Kohl Rohit Sharma
- నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి వన్డే
- తుది జట్టులోకి రోహిత్, విరాట్
- ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్, విరాట్‌ది మెరుగైన రికార్డు
ENG vs IND 1st ODI : టీ20 ఫార్మాట్లో వరుసగా ఓటములు చవిచూస్తున్న టీమిండియా.. ఇంగ్లాండ్ గడ్డపై నేడు వన్డే మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా నేటి సాయంత్రం 3.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఇంగ్లాండ్‌తో మ్యాచ్ జరగనుంది. తొలిపోరులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తోడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ పేసర్ బుమ్రాలతో జట్టు బలంగా కనిపిస్తోంది. అయితే, అందరిచూపు రోహిత్, కోహ్లీలపైనే ఉంది. వీరిద్దరూ ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టుకు ఏమేరకు విజయాలు అందిస్తారని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ వన్డే పోరు ఇరు జట్లకూ అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఊపులో ఇంగ్లాండ్ ఉండగా.. సీనియర్ల రాకతో మరింత బలోపేతమైన భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ విధ్వంసక ఓపెనింగ్, కోహ్లీ క్లాస్ బ్యాటింగ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై వీరి గణాంకాలను చూస్తే మెరుగ్గానే ఉన్నాయి.
ఇంగ్లాండ్ గడ్డపై 27 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 64.9 సగటుతో 1426 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉండగా.. స్ట్రయిక్ రేట్ 90.78గా ఉంది. విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ గడ్డపై మెరుగైన ప్రదర్శనే చేశాడు. విరాట్ మొత్తం 33 ఇన్నింగ్స్ లలో 51.88 సగటుతో 1349 పరుగులు సాధించాడు. కోహ్లీ పేరిట వన్డేల్లో 54 అంతర్జాతీయ శతకాలు నమోదుకాగా.. ఇందులో ఇంగ్లాండ్ గడ్డపై ఒక శతకం మాత్రమే ఉండటం గమనార్హం. ఇంగ్లాండ్ పిచ్‌లపై నెమ్మదిగా ఆడుతూ జట్టు విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇవాళ జరిగే మ్యాచ్‌లో రోహిత్ – కోహ్లీలు సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భారత్ తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే/అక్షర్ పటేల్, గుర్నార్ బ్రార్/ ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా
