విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అర్ధరాత్రి ఆందోళన.. ఘటనకు నిరసనగా జూడాల సమ్మె
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి ..

Vijayawada government hospital
Vijayawada Government Hospital : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు.
Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?
ఆస్పత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరామ్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్లర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.
విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేము ఏం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.