కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 03:04 PM IST
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Updated On : March 29, 2019 / 3:04 PM IST

 ఢిల్లీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న 35 మంది అభ్యర్థులు తమ పార్టీ వారు కాదని స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను చంద్రబాబే నిలబెట్టారని ఆరోపించారు. తాను చంద్రబాబు మనిషిని అయితే టీడీపీకి ఓటేయొద్దని ఎందుకు కోరతానని చెప్పారు. 

జగన్, చంద్రబాబు తోడు దొంగలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్చి 25న ఐలవరంలోని హోటల్ లో తమపై దాడి చేసి పార్టీ బీఫాంలు దొంగిలించారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరామని తెలిపారు. ఎన్నికలను వాయిదా వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.