శభాష్ పోలీస్ : 4కిమీ భుజాలపై మోసుకెళ్లి ప్రాణాలు కాపాడాడు
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి

ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి
ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడే వాడు పోలీస్ అని నిరూపించాడు ఆ కానిస్టేబుల్. అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. స్వయంగా తన భుజాలపై వృద్ధురాలిని 4 కిలోమీటర్లు మోశాడు. ఆమెని ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడాడు. శభాష్ పోలీస్ అని అందరితో అనిపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కాలిబాటన తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న ఓ వృద్ధురాలు మార్గమధ్యలో అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఓ పోలీస్ స్పందించి.. వృద్ధురాలిని భుజాలపై 4 కిలోమీటర్లు మోసుకొని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడాడు.
రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి వేలాది మంది భక్తులతో తిరుమలకు ఇటీవల పాదయాత్ర చేపట్టారు. సోమవారం(డిసెంబర్ 16,2019) అన్నమయ్య కాలిబాటలో యాత్ర కొనసాగింది. అదే సమయంలో ఓ వృద్ధురాలు ఆస్వస్థతతో సొమ్మసిల్లి పడిపోయింది. ఈ పాదయాత్రకు బందోబస్తు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ కుళ్లాయప్ప వృద్దురాలిని చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి ఆమెను తన భుజాలపై మోసుకువెళ్లాడు.
నడక తప్ప మరో మార్గం లేని అటవీ ప్రాంతం నుంచి ఆమెని 4 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కుళ్లాయప్పను ప్రశంసించారు. శభాష్ పోలీస్, సెల్యూట్ పోలీస్ అంటూ జనాలు కూడా కితాబిచ్చారు. ప్రాణాలు నిలిపిన పోలీస్ ను దైవంతో పోల్చారు. ఆ వెంకన్న సామే.. కానిస్టేబుల్ కుళ్లాయప్ప రూపంలో వచ్చి వృద్ధురాలిని కాపాడాడని మెచ్చుకున్నారు.