Kadapa : దుర్మార్గుడికి అదే శిక్ష పడాలి – శిరీష తల్లిదండ్రులు

తన కూతురిని చంపిన దుర్మార్గుడికి కూడా అదే శిక్ష వేయాలని మృతురాలి (శిరీష) తల్లి కోరుతోంది. మళ్లీ వేరే అమ్మాయికి ఇలాంటి గతి పట్టకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది.

Kadapa : దుర్మార్గుడికి అదే శిక్ష పడాలి – శిరీష తల్లిదండ్రులు

Kadapa Sirisha Murde

Updated On : June 19, 2021 / 4:12 PM IST
Kadapa Sirisha : తన కూతురిని చంపిన దుర్మార్గుడికి కూడా అదే శిక్ష వేయాలని మృతురాలి (శిరీష) తల్లి కోరుతోంది. మళ్లీ వేరే అమ్మాయికి ఇలాంటి గతి పట్టకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామన్నారు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. తనను ప్రేమించనందుకే చరణ్‌ దారుణానికి  పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
ప్రేమోన్మాది చేతిలో శిరీష మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం శిరీష మృతదేహాన్ని కడప జిల్లా బద్వేల్ మండలం చింతల చెరువు గ్రామానికి తరలించారు. శిరీష మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామస్తులు అంతా భారీగా తరలివచ్చారు. కూతురి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
డిగ్రీ చదువుతున్న శిరీషను అట్లూరు మండలానికి చెందిన చరణ్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. తనను ప్రేమించడం లేదని యువతి చెప్పడంతో ఆమెపై పగ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం పొలంలో పనిచేస్తున్న సమయంలో యువతిపై కత్తితో దాడి చేశాడు నిందితుడు. బాధితురాలు కేకలు విన్న బంధువులు, స్థానికులు చరణ్‌ను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే అప్పటికే తీవ్రగాయాలైన యువతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.