సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చంద్రబాబు చదివి వెళ్లారు: కాకాణి

Kakani Govardhan Reddy: సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చంద్రబాబు చదివి వెళ్లారు: కాకాణి

Updated On : April 21, 2024 / 7:20 PM IST

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో టీడీపీ నిర్వహించిన సభకు ప్రజలు రాకపోతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఆరోపణలు చేశారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆ సభలో సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను చంద్రబాబు నాయుడు చదివి వెళ్లారని అన్నారు.

సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. మెట్ట ప్రాంతం సర్వేపల్లికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీంతో ఏమీ చెప్పుకోలేక, తనను, జగన్‌ను తిట్టారని అన్నారు. తనపై చంద్రబాబు నాయుడు అభియోగాలు చేశారని అన్నారు.

ఆ అభియోగాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు తాను సిద్ధమని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు తనపై వచ్చిన అభియోగాలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు చంద్రబాబు నాయుడిపై నమ్మకం లేదని చెప్పారు. సర్వేపల్లిలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారని అన్నారు. ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక స్థానం కూడా గెలుచుకోదని చెప్పారు.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాని మోదీ ఓ భరోసా ఇచ్చారు: డీకే అరుణ