ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాని మోదీ ఓ భరోసా ఇచ్చారు: డీకే అరుణ

DK Aruna: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని అన్నారు. ఇచ్చిన మాటను..

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాని మోదీ ఓ భరోసా ఇచ్చారు: డీకే అరుణ

DK Aruna

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ పోరాడుతూనే ఉన్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో‌ ఈ సమస్యను ప్రధాని మోదీదీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన మోదీ మాదిగలకు ఓ భరోసా ఇచ్చారని డీకే అరుణ చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తమకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు.

మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణను గెలిపించే బాధ్యత ఎమ్మార్పీఎస్‌దని చెప్పారు. వర్గీకరణకు మోదీ నుంచి భరోసా రావడం సంతోషకరమని తెలిపారు. ఆయన ఈ హామీని‌ నిలబెట్టుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. వర్గీకరణ కోసం ఎందరో రాజకీయ‌ నాయకులను‌ కలిశామని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసిందని తెలిపారు.

సోనియా గాంధీ ఇచ్చిన‌మాట నిలుపుకోకుండా మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని అన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకునే వారిలో మోదీని మించినవారు లేరని చెప్పారు. మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో పాటు 371 ఆర్టికల్ రద్దు, అగ్రకులాలకు రిజర్వేషన్ ఇలా ఎన్నో చేశారని తెలిపారు. అందుకే ఆయన మాటపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.

AP Elections 2024: ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్